గ్రీన్‌లాండ్ గొడవలో దూరిన రష్యా.. అగ్గిపై పెట్రోల్ పోసిన మంత్రి!
అమెరికా, ఐరోపా దేశాల మధ్య గ్రీన్‌లాండ్ అంశంపై ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో రష్యా ఈ వివాదంలోకి ప్రవేశించింది. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌లాండ్ సహజంగా డెన్మార్క్‌లో భాగం కాదని ఆయన వెల్లడించారు. ఈ వివాదంపై రష్యా వైఖరిని స్పష్టం చేశారు.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ మాట్లాడుతూ.. "గ్రీన్‌లాండ్ సహజంగా డెన్మార్క్‌లో భాగం కాదు. అది నార్వేలో కూడా భాగం కాదు. అది కేవలం వలసవాద విజయం మాత్రమే" అని లావ్‌రోవ్ పేర్కొన్నారు. పూర్వపు వలస భూభాగాల సమస్య ఇప్పుడు మరింత తీవ్రమవుతోందని ఆయన విశ్లేషించారు. గ్రీన్‌లాండ్‌పై రష్యా కన్నేసిందని ట్రంప్ చేస్తున్న ఆరోపణలను లావ్‌రోవ్ కొట్టిపారేశారు. "గ్రీన్‌లాండ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలనే ఆసక్తి మాకు లేదు. ఆ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ప్రణాళికలు మాకు లేవని అమెరికాకు కూడా తెలుసు" అని ఆయన స్పష్టం చేశారు. ఒక నాటో సభ్య దేశం (అమెరికా), మరో సభ్య దేశాన్ని (డెన్మార్క్) బెదిరించడం నాటో చరిత్రలోనే అసాధారణమని, ఇది ఆ కూటమిలో తీవ్ర సంక్షోభాన్ని సూచిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

వివాదానికి కారణాలు:
గ్రీన్‌లాండ్‌ను అమ్మకపోతే ఐరోపా దేశాలపై ఫిబ్రవరి 1 నుంచి 10 శాతం, జూన్ నుండి 25 శాతం టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ బెదిరిస్తున్నారు. రష్యా, చైనాల నుంచి ముప్పు పొంచి ఉందని, అందుకే గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ వాదిస్తున్నారు. ట్రంప్ ఇప్పటికే గ్రీన్‌లాండ్‌ను అమెరికా మ్యాప్‌లో చేర్చి, దానిని "Greenland US Territory Est. 2026"గా ప్రకటించారు. డెన్మార్క్ ప్రధాని ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నప్పటికీ, ట్రంప్ మాత్రం గ్రీన్‌లాండ్ తన సొంతం కావాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో రష్యా చేసిన వ్యాఖ్యలు ఐరోపా దేశాల్లోని వలసవాద చరిత్రను గుర్తు చేస్తూ, అమెరికా-ఐరోపా మధ్య విభేదాలను మరింత పెంచేలా ఉన్నాయి.
-
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
"ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం" -
గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై ఏపీ వాసులకు సూపర్ న్యూస్.. మీకు దిగులు లేదు! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది?












Click it and Unblock the Notifications