ఉక్రెయిన్ పై అణుదాడికి రష్యా రిహార్సల్- కీవ్ పై బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం..!

రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం మొదలై ఈ మధ్యే వెయ్యి రోజులు దాటిపోయింది. అయినా ఇంకా ఉద్రిక్తతలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ ను తక్కువ అంచనా వేసి యుద్దం మొదలుపెట్టిన రష్యాకు అనతికాలంలోనే పాశ్చాత్య దేశాలు షాకిచ్చాయి. ఉక్రెయిన్ కు పాశ్చాత్య దేశాలు అందిస్తున్న సైనిక సాయంతో రష్యా మొదలుపెట్టిన పోరు ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో ఆగ్రహంగా ఉన్న రష్యా అధినేత వ్లాదిమీర్ పుతిన్ తాజాగా తమ అణ్వస్త్ర విధానంలో మార్పులు చేసింది.

దీనికి కొనసాగింపుగా ఇవాళ ఉక్రెయిన్ లోని కీవ్ పైకి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఉక్రెయిన్ రాజధానిపైకి ప్రయోగించిన ఈ ఖండాంతర క్షిపణి వాస్తవంగా అణ్వస్త్రాలు మోసుకెళ్లే సత్తా కలిగినది కావడంతో రష్యా రిహార్సల్ చేసిందా అన్న చర్చ మొదలైంది. అదే సమయంలో ఉక్రెయిన్ తో పాటు ఆ దేశానికి అండగా ఉన్న పాశ్చాత్య దేశాలకు హెచ్చరిక పంపేందుకే రష్యా ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ కు మద్దతిస్తున్న పాశ్చాత్య దేశాలకు ఝలక్ ఇచ్చేందుకే రష్యా న్యూక్లియర్ విధానం సవరించిందన్న చర్చ నేపథ్యంలో ఈ క్షిపణి ప్రయోగం ప్రాధాన్యం సంతరించుకుంది.

Russia launches inter continental ballistic missile on Kyiv rehearsal to nuke attack

రష్యాపై దాడులకు ఉక్రెయిన్ కు దీర్ఘశ్రేణి క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతిచ్చిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ అణు విధానం సవరించారు. దీనికి కొనసాగింపుగా ఇవాళ ఖండాతర బాలిస్టిక్ క్షిపణి కూడా ప్రయోగించడంతో దీనికి పాశ్చాత్య దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. రష్యా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి వల్ల ఉక్రెయిన్ రాజధానిలో ఏ మేరకు నష్టం జరిగిందో తేలాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+