కుప్పకూలిన విమానం.. 49 మంది దుర్మరణం!
Plane Crash: రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నేడు ఉదయం అదృశ్యమైన అంగారా ఎయిర్‌లైన్స్ విమానం అమూర్ ప్రాంతంలో కుప్పకూలింది. రాయిటర్స్ ప్రకారం.. 49 మందితో వెళ్తున్న ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు రాగా.. కాసేపటికే అది కుప్పకూలినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలిసింది.
అంగారా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఏఎన్-24 ప్రయాణికుల విమానం గురువారం ఉదయం బ్లాగోవెష్ చెన్క్స్ నుంచి చైనా శివారులోని టిండా ప్రాంతానికి బయలుదేరింది. మరికాసేపట్లో గమస్థానానికి చేరుకుంటుందనే క్రమంలో.. ఉన్నట్టుండి ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. అదృశ్యమైన విమానం కోసం హెలికాప్టర్లు, డ్రోన్‌లను మోహరించారు. విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. గమ్యస్థానానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో కుప్పకూలినట్లు అధికారులు గుర్తించారు. ఆ సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది.

విమానం ల్యాండింగ్ స్పాట్‌కు చేరుకునే ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో సంబంధాలు తెగిపోయాయి. అది రాడార్ స్క్రీన్ నుండి మాయమైంది. విమానం అదృశ్యమయ్యే ముందు పైలట్ నుండి ఎటువంటి 'మేడే కాల్' సంకేతాలు కూడా రాలేదని తెలిసింది. ఘటనా స్థలిలో పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విమానం ముందుగా ల్యాండింగ్ కోసం ప్రయత్నించగా పరిస్థితులు అనుకూలించలేదని తెలిసింది. రెండో సారి ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. రాడార్ గల్లంతై కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రాణనష్టంపై ఇంకా వివరాలు తెలియరాలేదు. నివేదికల ప్రకారం.. ఎవరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని తెలుస్తోంది.
Russian An-24 plane with 49 aboard crashes in Amur region
— China Perspective (@China_Fact) July 24, 2025
Wreckage of crashed AN-24 plane found 15 km from Tynda, Russia. All passengers are feared dead from the crash. pic.twitter.com/WNtYRKNm2a
కుప్పకూలిన విమానం గురించి..
ఏఎన్-24 అనేది అంటోనోవ్-24కు సంక్షిప్తి రూపం. ఇది సోవియట్ రష్యాలో తయారైన మధ్యస్థ దూర ప్రయాణానికి ఉపయోగపడే డబుల్ ఇంజిన్ టర్బోప్రాప్ ప్యాసింజర్ విమానం. తక్కువ దూరాలకు ప్రయాణించడానికి ఈ విమానాన్ని రూపొందించారు. ప్రాంతీయ విమానయానానికి ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. 1959లో ఈ విమానం తొలిసారిగా గగనంలోకి ఎగిరింది. రష్యా, తూర్పు యూరోప్, ఆసియాలోని ప్రాంతాలలో ప్రయాణించడానికి ఈ విమానాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు.అంటోనోవ్-24 విమానం 1500 నుండి 2,000 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. తక్కువ దూరం ఉన్న రన్‌వేల నుంచి కూడా సులభంగా టేకాఫ్, ల్యాండింగ్ చేయగలగడం ఈ విమానం ప్రత్యేకత. దీని డిజైన్ కారణంగానే ఈ విమానాన్ని తరచుగా కార్గో విమానంగా కూడా ఉపయోగిస్తారు. సైనిక రవాణాలో కూడా ఈ విమానం విస్తృతంగా ఉపయోగించబడుతుంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications