యుద్ధం వేళ.. భారత్ కు రష్యా భారీ సాయం..! షాక్ లో ట్రంప్..!
భారత్ కు చిరకాల స్నేహితుడు ఎవరు అంటే రష్యా అని అందరికి తెలిసిందే. భారత్ కు ఏ కష్టం వచ్చినా సాయం చేయడంలో రష్యా ముందుంటుంది. పహల్గామ్ ఉగ్రదాడి సమయంలో పాకిస్థాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో చాలా వరకు రష్యా ఆయుధాలనే భారత్ వినియోగించి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక రష్యా నుంచి ముడి చమురును భారత్ ఎప్పటినుంచో కొనుగోలు చేస్తోంది. మధ్యలో అమెరికా ఆంక్షలు విధించినా.. రష్యాను మాత్రం భారత్ వదులుకోలేదు.
అయితే భారత్- రష్యా బంధం మరోసారి వెల్లివిరిసింది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా దాడులు జరుపుతోంది. మరోవైపు ఇరాన్ సైతం ఏమాత్రం తగ్గకుండా ఒంటరి పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ వద్ద ఉన్న బ్రహ్మాస్త్రం హార్మూజ్ జల సంధిని మూసివేసింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు నిల్వలపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. భారత్ తో పాటు అనేక దేశాలకు చమురు సరఫరా నిలిచిపోయే ప్రమాదం నెలకొంది. మరోవైపు భారత్ కు దాదాపు 40 శాతం చమురు ఈ హార్ముజ్ జలసంధి గుండానే వస్తుంది.
ఇక భారత్ వద్ద కేవలం 25 రోజులకు సరిపోయే చమురు నిల్వలు మాత్రమే ఉన్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే భారత్ కు మరోసారి ఆపన్నహస్తం ఇచ్చేందుకు రష్యా రెడీ అయింది. ఇండియాకు తగినంత చమురు సరఫరా చేసేందుకు సిద్ధమైంది. భారత్ కు ఏకంగా 9.6 మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురును అందించేందుకు రష్యా సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకు రష్యా చమురు నౌకలు భారత్ కు బయల్దేరినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

గతంలో భారత్ పై అమెరికా కన్నెర్ర చేసిన విషయం తెలిసిందే. రష్యా నుండి చమురు కొనుగోలు చేయవద్దని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు కండీషన్స్ పెట్టారు. ఈ మేరకు భారత్ ఒత్తిడి తెచ్చారు. అంతటితో ఆగకుండా భారత్‌పై 25 శాతం అదనపు సుంకాలు కూడా విధించారు. అయినా భారత్ మాత్రం తన చిరకాల మిత్రుడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపలేదు. ఈ క్రమంలోనే భారత్ కు మరోసారి హెల్ప్ చేసేందుకు రష్యా ముందుకొచ్చింది.
-
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
భారత్‌లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
గ్యాస్, పెట్రోల్, డీజిల్ పై ఏపీ వాసులకు సూపర్ న్యూస్.. మీకు దిగులు లేదు! -
యుద్ధం వేళ.. భారత్ కు అదానీ బిగ్ బూస్ట్.. 2 వేల మెషిన్ గన్ లు డెలివరీ.. -
3 ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐ షాక్.. రూల్స్ బ్రేక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ !! -
పెరుగులో ఉప్పు లేదా చక్కెర - ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది..!! -
దివ్యాంగుల ప్రతిభకు పట్టం: రూ. 5 లక్షలు గెలుచుకునే ఛాన్స్.. అప్లై చేసుకోండిలా! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!












Click it and Unblock the Notifications