ఉక్రెయిన్‌పై దాడులు ఆపండి, మళ్లీ చర్చలు జరపండి: రష్యాకు యూఎన్‌జీఏ

న్యూయార్క్: ఉక్రెయిన్‌పై వైమానిక దాడులకు పాల్పడుతున్న రష్యాపై ఐక్యరాజ్యసమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యా సైనిక దాడి.. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడు అబ్దుల్లా షాహిద్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తక్షణమే కాల్పుల విరమణ, దౌత్యం, సంభాషణకు పూర్తిగా తిరిగి రావాలని పిలుపునిచ్చారు.

ఉక్రెయిన్‌పై 193 మంది సభ్యులతో కూడిన యూఎన్ బాడీ అరుదైన అత్యవసర ప్రత్యేక సమావేశానికి షాహిద్ అధ్యక్షత వహించారు. భారతదేశం ఉక్రెయిన్‌కు మానవతావాద సహాయాన్ని ప్రకటించింది. బెలారసియన్-ఉక్రేనియన్ సరిహద్దులో ఉక్రెయిన్-రష్యా మధ్య మొదటి చర్చలను స్వాగతించింది.

దాదాపు 5 గంటల పాటు జరిగిన చర్చలు ఎలాంటి తక్షణ అంగీకారం లేకుండా ముగిశాయి. రానున్న రోజుల్లో మరో రౌండ్ నిర్వహించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

ఉక్రేనియన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీకి ఉన్నత సలహాదారు అయిన మైఖైలో పోడోల్యాక్ మాట్లాడుతూ.. చర్చలు సాధ్యమైన కాల్పుల విరమణపై దృష్టి సారించాయని, రెండవ రౌండ్ "సమీప భవిష్యత్తులో" జరగవచ్చని అన్నారు.

Russia-Ukraine Conflict: UNGA calls for ceasefire as Moscow, Kyiv agree to another round of talks

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) యూఎన్ జనరల్ అసెంబ్లీ "అత్యవసర ప్రత్యేక సమావేశానికి" ఓటు వేసినప్పటికీ, బెలారసియన్-ఉక్రేనియన్ సరిహద్దులో ఉక్రెయిన్- రష్యా మధ్య జరిగిన మొదటి చర్చలను భారతదేశం స్వాగతించింది.

చర్చల కోసం ఉక్రెయిన్ తన రక్షణ మంత్రి, ఇతర ఉన్నతాధికారులను పంపింది, అయితే రష్యా ప్రతినిధి బృందానికి వాల్దిమిర్ పుతిన్ సలహాదారు నాయకత్వం వహించారు.

అల్బేనియా, యూఎస్ సమర్పించిన UNSC తీర్మానం ముసాయిదాకు 11 మంది సభ్యుల మద్దతు లభించింది. దీనిని రష్యా వ్యతిరేకించగా, చైనా, భారత్, యుఏఈలు గైర్హాజరయ్యాయి. శుక్రవారం కూడా, భారతదేశం, చైనా, యుఏఈ ఈ తీర్మానానికి దూరంగా ఉండగా, కౌన్సిల్‌లోని 11 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. రష్యాపై చర్చకు సంబంధించి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఓటింగ్‌కు కూడా భారత్ గైర్హాజరైంది. ఉక్రెయిన్ దాడి. అనుకూలంగా 29 మంది, వ్యతిరేకంగా ఐదుగురు ఓటు వేయగా, పాకిస్థాన్‌తో సహా 13 దేశాలు గైర్హాజరయ్యాయి.

ఉక్రెయిన్ తో చర్చలు విఫలం కావడంతో రష్యా దాడులను కొనసాగిస్తోంది. ఉక్రెయిన్ సైన్యం, ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ.. రష్యా బలగాలు ముందుకే కదులుతున్నాయి. బాంబు దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంతర్జాతీయ నాయస్థానాన్ని ఆశ్రయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+