Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Russia Ukraine War Reason ? 1991 లోనే బీజాలు- చరిత్రలో జరిగిందిదే..

ఉక్రెయిన్ పై రష్యా ఇవాళ అధికారికంగా యుద్ధం ప్రారంభించింది. ఉక్రెయిన్ పై ఆధిపత్యం కోసం దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్న రష్యా.. తాజాగా ఆ దేశంలో రెండు వేర్పాటువాద ప్రాంతాల్ని ప్రత్యేక దేశాలుగా గుర్తించి యుద్ధానికి తెరలేపింది. అక్కడితో ఆగకుండా ఇవాళ భౌతిక యుద్ధానికి దిగింది. ఈ నేపథ్యంలో అసలు ఉక్రెయిన్ పై రష్యాకు అంత కోపమెందుకొచ్చింది ? వీరిద్దరి మధ్య పోరుకు 1991లోనే బీజాలు పడ్డాయా అంటే చరిత్ర అవుననే అంటోంది.

Recommended Video

    Russia Destroyed Ukraine Military Air Bases And Air Defenses | Oneindia Telugu

    1991లో సోవియట్ రిపబ్లిక్ ఆఫ్ ఉక్రెయిన్ రష్యా నుంచి స్వాతంత్ర్యం పొందింది.సోవియట్ రిపబ్లిక్ ఆఫ్ ఉక్రెయిన్ నాయకుడు లియోనిడ్ క్రావ్‌చుక్ మాస్కో నుంచి స్వాతంత్ర్యం లభించినట్లు ప్రకటించాడు.ప్రజాభిప్రాయ సేకరణ , అధ్యక్ష ఎన్నికలలో, ఉక్రేనియన్లు స్వాతంత్రాన్ని ఆమోదించి క్రావ్‌చుక్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.మూడేళ్ల తర్వాత 1994లో లియోనిడ్ కుచ్మా అధ్యక్ష ఎన్నికలలో క్రావ్‌చుక్‌ను ఓడించాడు. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరిగాయని పరిశీలకులు భావించారు. అయితే 1999లో జరిగిన ఎన్నికల్లో మాత్రం కుచ్మా అక్రమాలతో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించాడు.

    Russia versus Ukraine- what are the reasons for present crisis, here is the timeline

    2004లో రష్యా అనుకూల అభ్యర్థి విక్టర్ యనుకోవిచ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. అయితే ఓట్ల-రిగ్గింగ్ ఆరోపణలతో తలెత్తిన నిరసనలు ఆరెంజ్ రివల్యూషన్‌గా మారిపోయాయి. దీంతో మళ్లీ పోలింగ్ నిర్వహించారు. ఇందులో పాశ్చాత్య దేశాల అనుకూల మాజీ ప్రధాన మంత్రి, విక్టర్ యుష్చెంకో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.2005లో యుష్చెంకో ఉక్రెయిన్‌ను క్రెమ్లిన్ ప్రభావం నుంచి బయటికి తెచ్చి నాటో , ఈయూ వైపు నడిపిస్తాననే వాగ్దానాలతో అధికారం చేపట్టాడు. యుష్చెంకో మాజీ ఎనర్జీ కంపెనీ బాస్ యులియా టిమోషెంకోను ప్రధాన మంత్రిగా నియమించాడు. కానీ, పాశ్చాత్య అనుకూల శిబిరంలో అంతర్గత పోరు తర్వాత ఆమెను కూడా తొలగించారు. 2008లో ఏదో ఒక రోజు ఉక్రెయిన్ ను కూడా నాటో కూటమిలో చేర్చుకుంటామని అధినేతలు హామీ ఇచ్చారు.

    2010లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో యనుకోవిచ్ తిమోషెంకోను ఓడించాడు. దీంతో రష్యా , ఉక్రెయిన్ ఉక్రేనియన్ నల్ల సముద్రపు ఓడరేవులో రష్యన్ నౌకాదళానికి లీజును పొడిగించడానికి బదులుగా గ్యాస్ ధరల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 2013లో నవంబర్‌లో యనుకోవిచ్ ప్రభుత్వం ఈయూతో వాణిజ్యం , అసోసియేషన్ చర్చలను నిలిపివేసింది, అలాగే రాజధాని కీవ్ లో నెలల తరబడి భారీ ర్యాలీలను ప్రేరేపించి మాస్కోతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించాలని నిర్ణయించుకుంది.

    అదే ఏడాది ఏప్రిల్‌లో డాన్‌బాస్ తూర్పు ప్రాంతంలో రష్యా అనుకూల వేర్పాటువాదులు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు. తరచూ కాల్పుల విరమణలు ప్రకటిస్తున్నా 2022 వరకు అడపాదడపా పోరాటాలు తప్పలేదు. .2013 మేలో వ్యాపారవేత్త పెట్రో పోరోషెంకో పాశ్చాత్య అనుకూల ఎజెండాతో అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. జూలైలో, ఆమ్‌స్టర్‌డామ్ నుండి కౌలాలంపూర్ వెళ్లే ప్రయాణీకుల విమానం MH17ను ఓ క్షిపణి కూల్చివేసింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మొత్తం 298 మంది మరణించారు. ఇది రష్యా పనేనని దర్యాప్తులో తేలినా పుతిన్ మాత్రం తోసిపుచ్చారు.

    Russia versus Ukraine- what are the reasons for present crisis, here is the timeline

    2017లో ఈయూతో ఉక్రెయిన్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ప్రకారం ఐరోపా దేశాలతో ఉక్రెయిన్ కు వ్యాపారం పెరిగింది. అలాగే ఉక్రెయిన్ వాసులు ఈయూలో దేశాలకు వీసా లేకుండానే ప్రయాణాలు చేసేందుకు అవకాశం దొరికింది. 2019లో ఉక్రెయిన్ కొత్త ఆర్దడాక్స్ చర్చికి గుర్తింపు లభించడంతో రష్యా ఆగ్రహం రెట్టింపైంది. తూర్పు ఉక్రెయిన్‌లో అవినీతిని పారద్రోలతానని, యుద్ధాన్ని ముగిస్తానన్న వాగ్దానాలతో మాజీ హాస్య నటుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఏప్రిల్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికలలో పోరోషెంకోను ఓడించి అధికారంలోకి వచ్చారు. ఆయన ఆధ్వర్యంలోని సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ పార్టీ జులైలో జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యూఎస్ అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న తన ప్రత్యర్థి జో బిడెన్, ఉక్రెయిన్‌లో చేస్తున్న వ్యాపార లావాదేవీలపై బిడెన్ కుమారుడు హంటర్‌పై దర్యాప్తు చేయమని జెలెన్స్కీని జూలైలో కోరారు.

    2021లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న బైడెన్ ను.. ఉక్రెయిన్ ను నాటో కూటమిలో చేర్చుకోవాలని అధ్యక్షుడు జెలెన్స్సీ కోరారు. ఆ తర్వాత రష్యాకు అనుకూలంగా ఉండే విపక్ష నేత మెడ్వెడ్చుక్ పై ఉక్రెయిన్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అనంతరం రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో బలగాలను మోహరించి సైనిక విన్యాసాలు నిర్వహించింది. గతేడాది అక్టోబర్ లో టర్కీలో తయారైన డ్రోన్ ను తమపై నిఘాకు ఉక్రెయిన్ వాడటం రష్యాకు మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో ఉక్రెయిన్ సరిహద్దులకు రష్యా మరిన్ని బలగాలు పంపింది. డిసెంబర్లో నాటో ఉక్రెయిన్ తో పాటు తూర్పు యూరప్ లో తన రక్షణ కార్యకలాపాలు తగ్గించుకోవాలని రష్యా డిమాండ్ చేసింది.

    Russia versus Ukraine- what are the reasons for present crisis, here is the timeline

    ఈ ఏడాది జనవరిలో ఉక్రెయిన్ పై అమెరికా, రష్యౌ దౌత్యవేత్తలు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జనవరి 14న రష్యా హ్యాకర్లు ఉక్రెయిన్ ప్రభుత్వ వెబ్ సైట్లపై సైబర్ దాడి చేశారు. అలాగే రష్యా బలగాలు బెలారస్ నుంచి ఉక్రెయిన్ వైపు కదలడం ప్రారంభించాయి. దీంతో నాటో కూడా ఉక్రెయిన్ తీరంతో పాటు సరిహద్దులకు బలగాలను, ఓడలను మోహరించేందుకు సిద్ధమైంది. ఆ తర్వాత రష్యా అభ్యంతరాలను పరిశీలిస్తామని అమెరికా చెప్పినా రష్యా సంతృప్తి చెందలేదు. ఈ నెలలో ఉక్రెయిన్ చుట్టూ నాటో దళాలకు సాయపడటానికి పోలాండ్,రొమేనియాకు అమెరికా బలగాలు పంపింది. చైనాలో తాజాగా జరిగిన వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా నాటోలో ఉక్రెయిన్ చేరికను అడ్డుకోవాలన్న తమ డిమాండ్ కు చైనా నుంచి రష్యా అధినేత పుతిన్ మద్దతు పొందారు. ఆ తర్వాత సంక్షోభ పరిష్కారానికి ఫ్రాన్స్ వంటి ఈయూలో ఉన్న దేశాలుప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. రష్యా ఉక్రెయిన్ పై దాడికి దిగింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+