ఉక్రెయిన్ పోరులో రష్యాకు నాటో దేశం పరోక్ష సాయం ? బాంబు పేల్చిన అమెరికా..

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలుపెట్టి ఏడాది కావస్తోంది. అయినా ఇంకా పోరు మాత్రం ఆగడం లేదు. దీనికి ప్రధాన కారణం ఉక్రెయిన్ కు పాశ్చాత్య, నాటో దేశాలు అందిస్తున్న సాయమే. దీంతో రష్యా కూడా పోరు కొనసాగిస్తూనే ఉంది. అయితే ఈ పోరులో ఇన్నాళ్లూ ఉక్రెయిన్ కు మాత్రమే సాయం చేస్తున్నాయని భావిస్తున్న నాటో దేశాలు.. రష్యాకు కూడా పరోక్షంగా సాయం అందిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది.

వ్లాదిమిర్ పుతిన్ తరపున ఉక్రెయిన్‌లో పోరాడుతున్న ఒక రష్యన్ పారామిలిటరీ బృందం ఆయుధాలు, సామగ్రిని నాటోకు చెందిన ఓ సభ్య దేశం నుంచి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిందంటూ అమెరికా తాజాగా బాంబు పేల్చింది. ఈ మేరకు అమెరికా మిలటరీకి చెందిన ఓ లీక్ డాక్యుమెంట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ లీకైన పత్రం ఉక్రెయిన్‌లో యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్నందున రష్యా ప్రైవేట్ మిలిటరీ గ్రూప్ వాగ్నర్ తన సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఎంతగా ప్రయత్నించిందో చూపుతున్నట్లు కనిపిస్తోంది.

russian group try to buy weapons from NATO member country, reveals US military document

నాటో సభ్యదేశమైన టర్కీ.. ఓవైపు ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండిస్తూనే మరోవైపు పరోక్షంగా వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్నట్లు ఈ యూఎస్ డాక్యుమెంట్ చెబుతోంది. ఈ డాక్యుమెంట్‌లో చెప్పిన యూఎస్ సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ రిపోర్టింగ్ ప్రకారం.. వాగ్నర్ గ్రూప్ సిబ్బంది ఫిబ్రవరి ప్రారంభంలో "టర్కీ నుండి ఆయుధాలు, సామగ్రిని కొనుగోలు చేయాలనే" ఉద్దేశ్యంతో "టర్కిష్ పరిచయాలను" కలిశారు, దానిని వాగ్నర్ కిరాయి సైనికులు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే టర్కీ వాగ్నెర్ గ్రూప్‌కు ఆయుధాల విక్రయాలతో ముందుకు సాగినట్లు చూపే ఆధారాలు మాత్రం లేవు. అయినప్పటికీ, నాటో మిత్రరాజ్యం రష్యన్ కిరాయి దళాలకు ఆయుధాలను విక్రయించే అవకాశం వాషింగ్టన్‌లో ఆందోళనలను పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+