రష్యా సైనికుల చిలకొట్టుడు- ఉక్రెయిన్ మహిళలకు కవ్వింపులు-డేటింగ్ యాప్ లో రిక్వెస్టులు
ఓవైపు రష్యాకూ, ఉక్రెయిన్ కు మధ్య యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరుతుందన్న భయాలతో ఆ దేశంపై రష్యా దండయాత్ర మొదలుపెట్టింది. ఇది కాస్తా రకరకాల మలుపులు తిరుగుతోంది. దీనిపై ప్రపంచ దేశాల్లో ఆందోళన కూడా పెరుగుతోంది. ఇంత సీరియస్ సమయంలోనూ రష్యా సైనికులు తమ చిలక్కొట్టుడికి పని చెప్పారు.యుద్ధాన్ని అదనుగా తీసుకుని ఉక్రెయిన్ మహిళల్ని టిండర్ యాప్ లో కవ్వించే పని మొదలుపెట్టారు.
ఉక్రెయిన్ లో యుద్ధం జరుగుతున్నవేళ మహిళలు ప్రాణభయంతో ఇళ్లకు పరిమతం అవుతున్నారు. ఇలాంటి సమయంలో రష్యా సైనికులు డేటింగ్ యాప్ టిండర్ లో వారికి రిక్వెస్ట్ లు పంపుతున్నారు. డేటింగ్ చేద్దామంటూ ప్రతిపాదిస్తున్నారు. తమను తాము రష్యా సైనికులుగా చెప్పుకోకుండా, ఇంజనీర్లు, నిపుణులుగా చెప్పుకుంటూ ఈ డేటింగ్ రిక్వెస్ట్ లు పంపుతున్నారు. దీంతో ఉక్రెయిన్ మహిళలు గందరగోళంలో పడుతున్నారు. యుద్ధ సమయంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Poignant: A man draped in the Ukrainian flag embraces a woman wearing the Russian flag. Let us hope love, peace & co-existence triumph over war & conflict. pic.twitter.com/WTwSOBgIFK
— Shashi Tharoor (@ShashiTharoor) February 25, 2022

బ్రిటిష్ టాబ్లాయిడ్ ది సన్ కథనం ప్రకారం రష్యా దళాలు డేటింగ్ యాప్ టిండర్‌లో ఉక్రేనియన్ మహిళలకు అభ్యర్థనలు, సందేశాలు పంపడం ప్రారంభించాయి. డేటింగ్ యాప్‌లో 'ప్లేసెస్' ఆప్షన్ ఉంది, దీని ద్వారా ఎవరైనా తమకు నచ్చిన వారిని ఎంచుకోవచ్చు. అలాగే తమకు సమీపంలో ఉన్న వ్యక్తులకు మెసేజులు పంపవచ్చు. ది సన్ కథనం ప్రకారం ఇలాగే చాలా మంది రష్యన్ సైనికులు దాని సరిహద్దు పాయింట్ల వద్ద పొరుగు దేశంలోకి ప్రవేశించిన తర్వాత డేటింగ్ యాప్‌లో ఉక్రేనియన్ వినియోగదారుల పరిధిలోకి వచ్చారు. దీంతో మహిళలకు సులువుగా ఈ రిక్వెస్ట్ లు పంపుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications