Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

8 రష్యా యుద్ద విమానాలు ధ్వంసం.. శాటిలైట్ చిత్రాలు ఇవిగో.. రష్యా మాత్రం

క్రిమియా ఎయిర్ బేస్‌పై రష్యా యుద్ద విమానాలు దాడికి దిగిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు 8 యుద్ద విమానాలు ధ్వంసం అయ్యాయి. క్రిమియలో గల శాకీ ఎయిర్ బేస్‌కు సంబంధించి శాటిలైట్ చిత్రాల్లో అదీ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించి కివ్ మాత్రం 9 యుద్ద విమానాలు దాడికి దిగాయని అంటోంది. రష్యా మాత్రం ఒకరు చనిపోయారు.. 14 మంది గాయపడ్డారని వివరించారు. పదుల సంఖ్యలో నివాస గృహాలు ధ్వంసం అయ్యాయని రిపోర్ట్ చేసింది.

యుద్ద విమానాలు ధ్వంసం చేశామని కివ్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సలహాదారు మాత్రం పాక్షికంగా దాడి చేయొచ్చు అని సూత్రప్రాయంగా తెలిపారు. దాడిలో విమానం ధ్వంసం కాలేదని రష్యా చెబుతుంది. దాడిని కప్పిపుచ్చుకునేలా ప్రకటన చేసింది.

Russian warplanes destroyed in Crimea airbase attack

శాటిలైట్ చిత్రాలు మాత్రం నోవోఫెడోరివ్కాలో గల సైనిక స్థావరం వద్ద యుద్ద విమానాలను పేల్చివేసినట్టు కనిపించాయి. దాడికి దిగే సమయంలో పేల్చి వేసినట్టు ఉన్నాయి. అమెరికా ఆధారిత ల్యాబ్ నుంచి వచ్చిన చిత్రాలు మాత్రం మిలిటరీ విమానాలు కాలిపోయిన అవశేషాలు కనిపించాయి. అలాగే రన్ వే కూడా దెబ్బతిని చూపించింది. దీనిని రష్యా మాత్రం అంగీకరించడం లేదు.

ఈ నెల 9వ తేదీన ఉదయం 8 గంటలకు ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్ తీసిన చిత్రాలను రిలీజ్ చేశారు. అలాగే 10వ తేదీన సాయంత్రం 4.40 గంటలకు మరో ఇమేజ్ తీశారు. ఈ రెండింటిని చూస్తే బయట ఉన్న 8 యుద్ద విమానాలు దెబ్బతిని ఆగుపించాయి. అంతకుముందు సాధారణ స్థితిలో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే 160 కిలోమీటర్ల కన్నా ఎక్కువదూరంలో ఉన్న ప్రదేశం ఎలా దాడికి గురయ్యిందనే సందేహాం వస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+