Titan Submarsible: టైటాన్ సబ్ మెర్సిబుల్ ఎందుకు పేలిందో తెలుసా..!
టైటానిక్ శిథిలాలను చూసుందుకు వెళ్లిన సబ్ మెర్సిబుల్ పేలిపోయిన విషయం తెలిసిందే. అయితే టైటాన్ సబ్ మెర్సిబుల్ పేలడానికి గల కారణాలు శాస్ట్రేవత్తలు వివరించారు. టైటాన్ టూరిస్ట్ సబ్‌మెర్సిబుల్ నిర్మాణ సమయంలో ఖర్చులను ఆదా చేయడానికి ఓషన్ గేట్ ప్రయత్నం చేసినట్లు భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే సబ్ మెర్సిబుల్ డిజైన్‌లోని అనేక లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సబ్ మెర్సిబుల్ డిజైన్‌లో బలహీనమైన అంశాలను శాస్త్రవేత్తలు వివరించారు.
ఒక ముఖ్యమైన వ్యయ-తగ్గింపు చర్యలో టైటాన్‌ను డెక్‌పై తీసుకెళ్లడానికి చాలా చిన్నదైన పోలార్ ప్రిన్స్ అనే మదర్‌షిప్‌ను అద్దెకు తీసుకున్నారని చెప్పారు. తత్ఫలితంగా, సబ్మెర్సిబుల్ మూడు రోజుల పాటు కఠినమైన సముద్ర జలాల మధ్య పేలిపోయి ఉండవచ్చని అంచనా వేశారు. అసాధారణ డిజైన్ల ఎంపిక, టెస్టింగ్ నిర్వహణ లోపం, సర్టిఫికేషన్ పర్యవేక్షణ వంటి లోపాలతో సబ్ మెర్సిబుల్ పేలుడు సంభవించి ఉండవచ్చని పేర్కొన్నారు. వారు సంప్రదాయ సబ్ మెర్సిబుల్ కాకుండా మాత్ర ఆకారపు డిజైన్ చేశారని వివరించారు.

ఇలా డిజైన్ చేయడం వల్ల ఎక్కువ మంది అందులో పడతారని చెప్పారు. సాధారణంగా సముద్ర జలాల ఒత్తిడిని తగ్గించుకోవడానికి గోళాకారంగా తయారు చేయాలి. కానీ ఈ సబ్ మెర్సిబుల్ భిన్నంగా తయారు చేశారని పేర్కొన్నారు. 1973 నుంచి ఎటువంటి ప్రమాదాలు లేకుండా 4,500 లోతైన సముద్ర డైవ్‌లను పూర్తి చేసిన ఆల్విన్, గోళాకార పొట్టును కలిగి ఉంది. టైటాన్, US ప్రభుత్వ రీసెర్చ్ సబ్ ఆల్విన్ మధ్య ప్రధాన తేడా ఇదేనని స్పష్టం చేశారు.
ఆల్విన్ పెద్ద క్రేన్ ను ఉపయోగించి సముద్రంలోకి దింపుతారు. కానీ సబ్ మెర్సిబుల్ ను ఒక చిన్న చార్టర్డ్ నౌక ద్వారా సముద్ర జలాల్లోకి పంపించారని తెలిపారు. అదనంగా, టైటాన్ సెంట్రల్ సిలిండర్ సాధారణంగా ఉపయోగించే టైటానియంకు బదులుగా కార్బన్ ఫైబర్‌ను ఉపయోగించి నిర్మించారని వివరించారు. కార్బన్ ఫైబర్, టైటానియం తయారు చేశారు. అధిక నీటి పీడనం ఈ లోహాలు తట్టులేవని పేర్కొన్నారు. OceanGate CEO స్టాక్‌టన్ రష్ పరీక్ష, ధృవపత్రాల విధానం పరిశీలనలో ఉంది.
జూన్ 18న, టైటానిక్ శిథిలాల వద్దకు డైవ్ చేస్తున్న సమయంలో టైటాన్ పేలిపోవడంతో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో ఓషన్‌గేట్ సీఈవో స్టాక్‌టన్ రష్, బ్రిటీష్ బిలియనీర్ హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ టైటానిక్ నిపుణుడు పాల్-హెన్రీ నార్గోలెట్, పాకిస్థానీ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులైమాన్ దావూద్ ప్రాణాలు కోల్పోయారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications