'దెయ్యం మహిళ': బాయ్‌ఫ్రెండ్ కోసం కుటుంబాన్నే క్రూరంగా చంపింది
లండన్: బాయ్ ఫ్రెండ్ మోజులో పడిన యువతి ఏకంగా తన కుటుంబాన్ని హత్య చేసింది. పట్టుమని పదహారేళ్లు నిండకముందే కుటుంబం మొత్తాన్ని హత్య చేసింది. ప్రస్తుతం 24 ఏళ్లు ఉన్న ఎరిన్ కాఫీ అనే ఆ యువతి గత ఎనిమిదేళ్లుగా తన సొంత కుటుంబాన్ని హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆమెను ఎరిన్ కాఫే అనే బ్రిటన్‌కు చెందిన మాజీ జడ్జి పీర్స్ మోర్గాన్ ఆమెను జైలులో కలిశాడు. ఆ క్షణంలో ఆమెతో మాట్లాడేముందు ఏ మాత్రం జంకు లేకుండా ప్రశ్నించాడు. ఈయన సాధారణంగా టీవీ కార్యక్రమాల కోసం క్రూరమైన నేరాలు చేసే వారిని ఇంటర్వ్యూ చేస్తుంటారు.
అలా ఇంటర్వ్యూ చేసిన వారిలో ఈమె కూడా ఉంది. దీనిపై ఆయన మాట్లాడుతూ.. తాను తన జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటి దుష్ట మహిళను చూడలేదని చెప్పారు. ఆమె తన కుటుంబాన్ని ఎందుకు హత్య చేసిందో తనకు వివరించిందని తెలిపారు.

ఆమె చెప్పిన ప్రకారం 2008 నాటికి ఎరిన్ వయస్సు పదహారేళ్లు. అప్పటికే ఆమెకు అన్ని రకాల దురలవాట్లు ఉన్నాయి. ముఖ్యంగా ఓ బాయ్ ఫ్రెండుతో తిరిగేది. తల్లిదండ్రులతో కూడా అసభ్యంగా మాట్లాడటం, రాత్రివేళ బాయ్ ఫ్రెండు పిచ్చిలో పడి అతడి వద్దే ఉండటం చేసేది.
ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు హెచ్చరించారు. వారి మాటను వినలేదు. కానీ విన్నట్లుగా నటించింది. ఎలాగైనా తన తల్లిదండ్రులను భూమి పైన ఉంచకూడదని ఎరిన్ నిర్ణయించుకుంది. వారిని చంపేందుకు బాయ్ ఫ్రెండ్ చార్లీ, మరో స్నేహితుడు చార్లెస్ వెయిడ్, చార్లెస్ వెయిడ్ గర్ల్ ఫ్రెండ్ బాబీ జాన్సన్‌తో కలిసి కుట్ర చేసింది.
తొలుత ఆమె తల్లి పైన కాల్పులు జరిపించి కత్తులతో పొడిపించింది. తమ్ముడిపై కాల్పులు చేయించింది. మరో ఎనిమిదేళ్ల టేలర్‌ను కత్తితో హత్య చేయించింది. తండ్రి టెర్రీ పైన దారుణంగా ఐదుసార్లు కాల్పులు జరిపింది. విషయాన్ని విన్న పీర్స్ మోరాగన్ ఉలిక్కిపడ్డారు. తన జీవితంలో ఇలాంటి దుర్మార్గమైన, దెయ్యాన్ని చూడలేదని వ్యాఖ్యానించారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications