హాలీవుడ్ సినిమాను తలపించిన చైనా డిజాస్టర్: గగుర్పాటు దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో

చైనాలోని షాంఘైలో అనూహ్య సంఘటన సంభవించింది. ఓ రోడ్డు మొత్తం కుంగిపోయింది. రహదారిపై హఠాత్తుగా భారీ గొయ్యి ఏర్పడింది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే రద్దీ రోడ్డు అది. ఓ భాగం మొత్తాన్ని కూడా భూమి కబళించివేసింది. ఇంత పెద్ద మొత్తంలో భూమి కుంగిన ప్రభావం సమీప భవనాలపై పడింది. వాటికీ నష్టం వాటిల్లింది. పలు నివాసాలు బీటలు వారాయి. కొన్ని ఒరిగిపోయాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడ అమర్చిన సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.

రోడ్డును రెండు వైపులా నిలిపివేసి, దాని పక్కనే నిర్మాణ పనులు కొనసాగిస్తోన్న దృశ్యాలు సీసీటీవీ రికార్డుల్లో చూడొచ్చు. ఒకవైపు నిర్మాణ సామాగ్రి, తాత్కాలిక షెల్టర్లు, మరోవైపు పదుల సంఖ్యలో కార్మికులు అక్కడి సైట్ లో పని చేస్తోండటం ఇందులో రికార్డయింది. అదే సమయంలో ఉన్నట్టుండి భూమి కుంగింది. తొలుత రోడ్డు మొత్తం బీటలు వారింది. ఆ తర్వాత ఓ భారీ గుంత ఏర్పడింది. భూమి కుంగుతున్నప్పుడు కన్ స్ట్రక్షన్ సైట్ లో ఉన్న భారీ నిర్మాణ సామాగ్రి మొత్తం అందులో పడిపోయాయి.

Shocking Shanghai Sinkhole Swallows Roadway and Nearby Buildings Security Cameras Capture massive

షాంఘైలో భూమి కుంగిపోవడం సాధారణం. ఇక్కడి మెత్తటి ఒండ్రు నేలలు, భూగర్భ జలాల వెలికితీత పనులు, నేలకింద పలచటి ఇసుక పొరలు, పాత మౌలిక సదుపాయాలే దీనికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి- చిన్నపాటి గుంతలు మొదలుకుని ఇటువంటి భారీ కుంగుబాటులకు దారితీస్తాయని అంటున్నారు. తాజా ఘటన జనసాంద్రత గల పట్టణాల్లో మౌలిక సదుపాయాల భద్రతపై ఆందోళన పెంచింది.

2024 జనవరిలో షాంఘైలోని మిన్‌హాంగ్ జిల్లాలో మురుగునీటి పైపు పగిలిపోవడంతో రహదారి దాదాపు 10 మీటర్లు కుంగింది. 2017 నుంచి 2023 వరకు చైనా వ్యాప్తంగా భూమి కుంగిపోయిన సంఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. వీటిలో సుమారు 72 నుంచి 80 శాతం వరకు మానవ తప్పిదాలే. మౌలిక సదుపాయాల లోపాలు, నిర్మాణ సమస్యల్లో చోటుచేసుకునే లోపాల వల్లేనని డేటా స్పష్టం చేస్తోంది. తాజాగా షాంఘైలో సంభవించింది కూడా అటువంటిదేనని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+