Silvio Berlusconi: ప్రియురాలికి రూ.900 కోట్ల ఆస్తి రాసిచ్చాడు..!
ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని తన ప్రియురాలికి రూ.900 కోట్లకుపైగా ఆస్తి ఇచ్చారు. సిల్వియో బెర్లుస్కోని గత నెలల మరణించిన సంగతి తెలిసిందే. సిల్వియో బెర్లుస్కోని బతుకుండగానే ప్రియురాలు మార్తా ఫాస్సినా ఆస్తి ఇవ్వాలని వీలునామా రాశారు. బెర్లుస్కోనీ మార్తా ఫాస్సినాను చట్టబద్ధంగా వివాహం చేసుకోలేదు. కానీ వీలునామాలో మాత్రం భార్యగానే పేర్కొన్నారు. ఆయన వీలునామాను ఐదుగురు సంతానం, పలువుర సాక్షుల సమక్షంలో లాయర్లు చదివి వినిపించారు.
సిల్వియో బెర్లుస్కోని మొత్తం ఆస్తి రూ.54 వేల కోట్లు కాగా.. అదులో తన 33 ఏళ్ల ప్రియురాలు మార్టా ఫాసినాకు 100మిలియన్ యూరోల(రూ. 900 కోట్లకుపైగా) ఆస్తి చెందేలా వీలునామా రాశారు. తన మీడియా సామ్రాజ్యంపై నియంత్రణను తన ఇద్దరు పెద్ద పిల్లలకు ఇచ్చారని ది గార్డియన్ నివేదించింది. బెర్లుస్కోనీ, తన సోదరుడు పాలోకు 100మిలియన్ యూరోల ఆస్తి చెందేలా వీలునామా రాశారు.

2020లో సిల్వియో బెర్లుస్కోనీతో మార్టా ఫాసి ప్రేమ చిగురించింది. 33 ఏళ్ల ఫాసినా ఇటలీ పార్లమెంట్‌లోని దిగువ సభ సభ్యురాలు. 2018 నుంచి ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్‌గా పని చేస్తున్నారు. దీర్ఘకాలిక లుకేమియా చికిత్స కోసం బెర్లుస్కోని ఆసుపత్రిలో చేరారు. ఆయన జూన్ 12 న 86 సంవత్సరాల వయస్సులో మరణించారు. 1994లో బెర్లుస్కోని రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. మార్టా ఫాసినా బెర్లుస్కోని పార్టీలో సభ్యురాలిగా ఉన్నారు.
మాఫియాతో సంబంధం ఉన్నందుకు జైలు శిక్ష అనుభవించిన మాజీ చట్టసభ సభ్యుడు మార్సెల్లో డెల్'ఉట్రీకి 30 మిలియన్లు ఆస్తిని బెర్లుస్కోనీ రాసిచ్చారు. ప్రస్తుతం బెర్లుస్కోనీ పిల్లలు మెరీనా, పియర్ సిల్వియోలు ఫిన్‌ఇన్వెస్ట్‌లో 53% వాటాను కలిగి ఉన్నారు.ది గార్డియన్ ప్రకారం, బెర్లుస్కోనీ గత సంవత్సరం నోట్‌ప్యాడ్‌పై చేతితో వీలునామా రాశారు. అతను తన వ్యాపారేతర సంపదలో 60%ని మెరీనా, పియర్ సిల్వియోలకు రాశాడు. రెండో భార్య ముగ్గురు పిల్లలు బార్బరా, ఎలియోనోరా, లుయిగి మిగిలిన 40% రాసిచ్చారు. కొంత భాగాన్ని సోదరుడు, ప్రియురాలు, మార్సెల్లో డెల్ రాసిచ్చారు.












Click it and Unblock the Notifications