World Powerful Passports: ప్రపంచంలో పవర్ ఫుల్ పాస్ పోర్టులివే-వీసా అక్కర్లేని ప్రయాణం...!

అంతర్జాతీయంగా ప్రయాణాలు చేసేందుకు పాస్ పోర్టుతో పాటు వీసా కూడా అవసరం. పాస్ పోర్టును తమ పౌరులకు ఆయా దేశాలు ఇస్తుండగా.. వీసాలు మాత్రం వారు వెళ్లే దేశాలు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రపంచంలో కొన్ని దేశాల పాస్ పోర్టులకు పలు దేశాలు వీసా లేకుండానే ప్రయాణం చేసేందుకు వీలు కల్పిస్తుంటాయి. ఇలా ఏ దేశం పాస్ పోర్టుతో అయితే వీసా లేని ప్రయాణానికి ఎక్కువ దేశాలు అనుమతిస్తాయో అదే ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా పేరు తెచ్చుకుంటుంది.

తాజాగా విడుదలైన హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాలేవో తేలిపోయింది. ఇందులో సింగపూర్ అందరి కంటే టాప్ లో నిలిచింది. సింగపూర్ పాస్ పోర్టు ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్ పోర్టుగా నిలిచింది. దీంతో ఏకంగా 195 దేశాల్లో వీసా లేకుండానే ప్రయాణం చేసేందుకు వీలుంది. ప్రపంచంలోనే అగ్రరాజ్యాలుగా చెప్పుకునే అమెరికా, బ్రిటన్, జపాన్, చైనా, జర్మనీ, రష్యాలను వెనక్కి నెట్టి సింగపూర్ ఈ గౌరవం దక్కించుకుంది.

singapore stands first in world s most powerful passports list india at 85th sport

అయితే ఇలా శక్తివంతమైన పాస్ పోర్టులు కలిగిన దేశాల జాబితాలో రెండో స్ధానంలో ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ వంటి యూరప్ దేశాలతో పాటు జపాన్ కూడా నిలిచింది. ఈ దేశాల పాస్ పోర్టులతో 192 దేశాల్లో వీసా లేకుండా ప్రయాణించవచ్చు. మూడో స్ధానంలో ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్జెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ ఉన్నాయి. ఈ దేశాల పాస్ పోర్టుతో ఏకంగా 191 దేశాల్లో వీసా లేకుండా పర్యటించేందుకు వీలుంది.

న్యూజిలాండ్, నార్వే, బెల్జియం, డెన్మార్క్, స్విట్జర్లాండ్‌లతో పాటు బ్రిటన్ నాలుగో స్ధానంలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, పోర్చుగల్ ఐదో స్ధానంలో ఉండగా.. అమెరికా మాత్రం 186 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో ఎనిమిదో స్థానంలో నిలిచింది. భారత్ ఈ జాబితాలో 82వ స్ధానంలో ఉంది. భారత పాస్ పోర్టుతో కేవలం 58 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించే వీలుంది. ఇలా భారత పాస్ పోర్టుతో వీసా లేకుండా ప్రయాణించగల దేశాల్లో ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ వంటివి ఉన్నాయి. పొరుగున ఉన్న పాకిస్తాన్ 100వ స్థానంలో ఉంది, దీంతో కేవలం 33 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+