Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పక్షులకు మేత వేస్తే 2 లక్షల ఫైన్.. ఎక్కడో తెలుసా..?

అది సింగపూర్‌లోని తోవా పాయో ప్రాంతం. 71 ఏళ్ల షణ్ముగంనాథన్ షమ్లా అనే బామ్మ కనిపిస్తే చాలు.. ఆకాశం నుండి వందలాది పావురాలు ఒక్కసారిగా కిందకు దిగుతాయి. ఆ దృశ్యం చూడటానికి ఏదో సినిమాలో సీన్ లాగా చాలా అందంగా ఉంటుంది. కానీ, ఆమె పక్షులపై చూపించే ఆ అమితమైన ప్రేమే ఇప్పుడు ఆమెను కోర్టు మెట్లు ఎక్కించి, ఏకంగా రూ. 2,27,845 జరిమానా కట్టేలా చేసింది.

సింగపూర్ వన్యప్రాణి చట్టం ప్రకారం అడవి పక్షులకు ఆహారం పెట్టడం తీవ్రమైన నేరం. షమ్లా బామ్మకు ఈ విషయం తెలియనిదేమీ కాదు. గత ఏడాది మే నెలలోనే ఇదే నేరానికి ఆమెకు రూ.85,000 జరిమానా పడింది. అప్పట్లో ఇంకెప్పుడూ ఇలా చేయను అని కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ, ఆమె మనసులోని పక్షుల ప్రేమ ఆ హామీని ఎంతో కాలం నిలవనీయలేదు. కేవలం నెల రోజుల్లోనే మళ్ళీ తన పాత అలవాటును మొదలుపెట్టింది.

singapore-woman-fined-s-3-200-for-feeding-wild-birds

జూలై 2025 నుంచి జనవరి 2026 మధ్య కాలంలో ఆమె ఏకంగా తొమ్మిది సార్లు పక్షులకు ధాన్యం, రొట్టె ముక్కలు వేస్తూ పట్టుబడ్డారు. కోర్టులో ప్రాసిక్యూటర్లు సమర్పించిన వీడియో ఫుటేజ్‌లో.. ఆమె చుట్టూ పక్షుల గుంపులు ముసిరి ఉండటం స్పష్టంగా కనిపించింది. ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి ఆమె తన ఏరియా ఎంపీని కూడా కలిశారు. కానీ, ఎంపీని కలిసిన మూడు రోజులకే మళ్ళీ పక్షులకు మేత వేస్తూ అధికారులకు చిక్కడం ఆమె నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది.

న్యాయమూర్తి ముందు షమ్లా బామ్మ తనకు ఉద్యోగం లేదని, ఇన్సూరెన్స్ లేదని మొరపెట్టుకున్నారు. తక్కువ జరిమానా విధించాలని, కావాలంటే సమాజ సేవ చేస్తానని చెప్పారు. అయితే, ఆమె పదే పదే చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పునరావృత నేరస్థురాలు కావడంతో న్యాయస్థానం కఠినంగా వ్యవహరించింది. రూ.2.27 లక్షల భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆశ్చర్యకరంగా, అంతవరకు పేదరికం గురించి మాట్లాడిన బామ్మ, తీర్పు రాగానే ఆ మొత్తం వెంటనే చెల్లిస్తానని చెప్పి అందరినీ విస్మయానికి గురిచేశారు.

మన దేశంలో పక్షులకు మేత వేయడం పుణ్యకార్యంగా భావిస్తాం. కానీ సింగపూర్ వంటి దేశాల్లో ఇది పారిశుద్ధ్య సమస్యలకు, పక్షుల జనాభా అసాధారణంగా పెరగడానికి దారితీస్తుందని ప్రభుత్వం కఠినంగా ఉంటుంది. చట్టం దృష్టిలో ప్రేమ కంటే చట్టం గొప్పదని ఈ ఘటన నిరూపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+