ఎయిర్‌పోర్ట్ దగ్గర జంట పేలుళ్లు: 6గురు మృతి
అడెన్: మరోసారి విమానాశ్రయమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. ఈసారి యెమెన్‌లోని అడెన్ విమానాశ్రయానికి సమీపంలో రెండు కారుబాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ ఘటనలో ఒక కారు మిలటరీ క్యాంపు బేస్ వద్ద పేల్చగా.. మరో కారును క్యాంపు లోపలికి తీసుకెళ్లాక పేల్చారు. అయితే, అక్కడే ఉన్న మిలటరీ స్థావరం, ఎయిర్ పోర్ట్ లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

చనిపోయిన వాళ్లంతా మిలటరీ చెందిన వారే. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడిందనే విషయం ఇంకా తెలియరాలేదు.
గత కొంతకాలంగా ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద ఇలాంటి దాడులు చేస్తున్న నేపథ్యంలో తాజాగా యెమెన్ దాడి కూడా వారి పనే అని అధికారులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications