వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రెగ్జిట్: ఈయూ నుంచి బ్రిటన్ విడిపోవడానికి ప్రధాన కారణాలివే

|
Google Oneindia TeluguNews

లండన్: ఈయూ(యూరోపియన్ యూనియన్) నుంచి బ్రిటన్ విడిపోవాలని ఆ దేశ ప్రజలు కోరుకోవడానికి పలు ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా ప్రపంచ దేశాల్లో బ్రిటన్ పరపతి తగ్గి ఈయూ ప్రాబల్యం పెరిగిందని బ్రిటన్ ప్రజలు నమ్మారు. పోటీ పరిస్థితులు, వ్యవసాయం, పేటెంట్‌ చట్టాల విషయంలో ఈయూ పైచేయిగా నిలిచింది.

దీంతో బ్రిటన్ సౌర్వభౌమాధికారినికి ముప్పుగా భావించారు. అంతేగాక, యూరోపియన్ కమిషన్ గుత్తాధిపత్యాన్ని బ్రిటన్ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. చిన్న చిన్న అంశాల్లో కూడా ఈయూ నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయని పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడ్డారు. అన్ని పనులకు ఈయూ అనుమతి తీసుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. దీని వల్ల బ్రిటన్‌కు ఏటా రూ. 6వేల కోట్లకుపైగా నష్టం వాటిల్లుతోందని అంచనా వేశారు.

brex

యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడంవల్ల కార్పొరేట్‌ వర్గాలకు మాత్రమే ప్రయోజనం కలుగుతుందని బ్రిటన్ ప్రజలు నమ్మారు. ఈయూ నిత్యం ప్రజా స్వామ్యానికి వ్యతిరేకమని, సంస్కరణలకు అవకాశం ఇవ్వడం లేదని వామపక్ష భావజాలం ఉన్నవారు పూర్తిగా నమ్మారు.

ఈయూ వల్ల కొంత ప్రయోజనం ఉన్నప్పటికీ యూరో కరెన్సీవల్ల అందరికీ నష్టమని బ్రిటన్ వాణిజ్య వర్గాలు భావించాయి. నిజానికి యూరో కరెన్సీకి బ్రిటన్ దూరంగా ఉన్నప్పటికీ దాని పరోక్ష ప్రభావం బ్రిటన్ పౌండ్‌పై పడింది.

ఈయూ దేశాల్లోకి ఆఫ్రికా, ఆసియా నుంచి భారీగా వలసదారులను ఆహ్వానించడం కూడా బ్రిటన్‌కు మింగుడు పడటంలేదు. వారిలో కొంత మంది తమ దేశంలోకి వస్తే ఆర్థిక స్థితి దెబ్బ తింటుందని బ్రిటిషర్లు భయపడ్డారు.

ప్రధాన కారణాలు క్లుప్తంగా...

1. బ్రిటన్ సార్వభౌమాధికారాన్ని ఈయూ దెబ్బతీసిందని భావించిన ఓటర్లు
2. ఇబ్బందికరమైన నిబంధనలు విధించారని ఆరోపణ
3. ఆర్థిక సంస్కరణలకు సిద్ధపడకుండా, కార్పొరేట్‌ వర్గాలకు ఈయూ ప్రయోజనం కలిగిస్తోందని భావించన బ్రిటన్ ప్రజలు
4. ఈయూ వల్ల ఇబ్బంది లేదని, యూరో కరెన్సీతోనే సమస్య అని భావించారు
5. ఈయూ దేశాల్లోకి వలసదారులను ఆహ్వానించడంపై బ్రిటన్ అభ్యంతరం
6. ఈయూ వెలుపల వలస విధానాలు మరింత హేతుబద్ధంగా ఉండాలని కోరుకుంది
7. ఇప్పటికీ యూకే.. ఈయూకు భారీ మొత్తంలో డబ్బు సాయంగా అందించడం

English summary
Millions of Brits were attracted to the idea of homogenous England of old. Xenophobia is on the increase and Brexit did a great job of normalizing racism across Britain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X