శవయాత్రలో బికినీ డ్యాన్సర్లతో స్టెప్పులు!.. వాళ్లలా స్టెప్పులేస్తుంటే!
సందర్బాన్ని బట్టి మనుషులు హుందాగా వ్యవహరించాలి. అంటే వినోదాన్ని వినోదంలా.. విషాదాన్ని విషాదంలా స్వీకరించడన్నమాట. అలా కాకుండా.. మనిషి చనిపోయి ఓ కుటుంబం బాధపడుతుంటే.. అదే చావుకు వెళ్లి గ్రూప్ డ్యాన్సులు
తైవాన్: ఎవరికీ బాగున్నా.. లేకపోయినా.. తైవాన్‌కు చెందిన తంగ్ హ్సింగ్(76) అనే ఓ కౌన్సిలర్ ఆలోచన మాత్రం ఇదే. తన చావును పుట్టినరోజు లాగే సెలబ్రేట్ చేసుకోవాలని చనిపోయేముందు తన కుటుంబ సభ్యులతో చెప్పాడు. ఆ మేరకు తంగ్ హ్సింగ్ కుటుంబం కూడా ఆయన చావును బాగానే సెలబ్రేట్ చేసింది.
తంగ్ హ్సింగ్ మరణించిన రోజు.. ఆయన శవయాత్రను ఘనంగా నిర్వహించారు. విషాదాన్ని తలపించేలా కాకుండా.. ప్రతీ ఒక్కరిలో ఉత్సాహాన్ని రేకెత్తించేలా ఆ యాత్ర సాగింది. అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే అంశమేంటంటే.. ఆ శవయాత్రంలో ఏకంగా 50మంది బికినీ డ్యాన్సర్లతో స్టెప్పులేయించారు.

శవయాత్ర వాహనంపై కొందరు, వాహనం ఎదురుగా మరికొందరు.. అలా బికినీ ధరించిన అమ్మాయిలంతా స్టెప్పులేస్తుంటే.. రోడ్డు మీద వెళ్లేవారంతా రెప్ప వాల్చకుండా వారినే చూస్తుండిపోయారు.
ఈ ఏర్పాట్లన్ని కొడుకే దగ్గరుండి మరీ చూసుకున్నాడు. ఆవిధంగా.. తంగ్ హ్సింగ్ కోరినట్టు ఆయన చావును పుట్టినరోజు తరహాలో సెలబ్రేట్ చేసి వార్తల్లోకి ఎక్కారు. మొత్తానికి శవయాత్ర కాస్త వినోదయాత్రగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదేమో!












Click it and Unblock the Notifications