వాషింగ్టన్‌లో కాల్పులు: ఒకరు మృతి, 21 మందికి గాయాలు

వాషింగ్టన్: అమెరికాలోని సౌత్‌వెస్ట్ వాషింగ్టన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనేక మంది పాల్గొన్న కుకౌట్ కార్యక్రమంలో వివాదం చెలరేగడంతో ఇరువర్గాలవారు కాల్పులకు తెగబడ్డారు. 17ఏళ్ల యువకుడు మృతి చెందగా, ఆఫ్ డ్యూటీ పోలీస్ ఆఫీసర్ తీవ్రగాయాలపాలయ్యారు.

మరో 21 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున 12.30 గంటలకు ముగ్గురు సాయుధులైన దుండగులు.. పార్టీలోని వ్యక్తులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు.

 Southeast Washington: At least 21 people shot, one fatally, at a party

చనిపోయిన యువకుడిని క్రిస్టోఫర్ బ్రౌన్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరో ఆఫ్ డ్యూటీ పోలీసు అధికారి తీవ్రగాయాలపాలయ్యారని, అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. డుబోసిస్ ప్లేఎస్ఈ 3300 బ్లాక్ వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. దుండగులు చుట్టూ నిల్చుని కాల్పులకు తెగబడ్డారని తెలిపారు.

గాయపడిన వారిలో 11 మంది మహిళలు ఉన్నారని, క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. నార్తవెస్ట్ వాషింగ్టన్‌లోని ఓ రెస్టారెంట్ వద్ద మూడు వారాల క్రితం దుండగులు తొమ్మిది మందిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సుమారు 115 మంది ఇలాంటి కాల్పుల ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి కాల్పుల ఘటనలు అమెరికాలో సాధారణంగా మారిపోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+