spacex: అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలం: ఆకాశంలో పేలిపోయిన స్పెసెక్స్ స్టార్‌షిప్
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తికిగా ఎదురుచూసిన అతిపెద్ద రాకెట్ ప్రయోగం స్టార్‌ఫిష్ విఫలమైంది. ప్రపంచ సంపన్నుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్్ సంస్థ శక్తివంతమైన రాకెట్ 'స్టార్‌షిప్ సూపర్ హెవీ'ని ప్రయోగించింది. అయితే, ఇది భూమి నుంచి ఆకాశంలోకి దూసుకెళ్లిన కొద్దిసేపటికే సాంకేతిక లోపాల కారణంగా పేలిపోయింది.
టెక్సాస్‌లోని బోకా కికాలోని ఎలాన్ మస్క్ ఏరోస్పేస్ ఫెసిలిటీ స్టార్ బేస్ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించారు. అయితే, రాకెట్ పేలిపోవడంతో ప్రయోగం విఫలమైంది. ఈ సూపర్ హెవీ రాకెట్ మొత్తం 33 రాప్టర్ ఇంజిన్ల సహాయంతో ఆకాశంలోకి దూసుకెళ్లింది. అయితే, తొలి దశ తర్వాత రాకెట్ నుంచి సరేట్ కావాల్సిన బూస్తర్లు విడిపోలేదు. దీంతో రాకెట్ గతి తప్పి వణికిపోతూ ఆకాశంలో అస్తవ్యస్తంగా ప్రయాణించింది.

మూడు నిమిషాల తర్వాత రాకెట్ నుంచి బూస్టర్లు విడిపోయేలా ప్లాన్ చేశారు. అయితే, ఇవి సపరేట్ కాకపోవడంతో నాలుగు నిమిషాల్లోనే ఈ భారీ రాకెట్ పేలిపోయి ధ్వంసమైపోయింది. అయితే, ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని సరిచేస్తామని స్పేస్‌ఎక్స్ పేర్కొంది. నేటి వైఫల్యం నుంచి అనేక పాఠాలు నేర్చుకున్నామని, మరికొద్ది నెలల్లో మరో ప్రయోగం చేపడతామని.. సిబ్బందిని అభినందిస్తూ ఎలాన్ మస్క్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
largest rocket ever built…explodes mid flight
— ian bremmer (@ianbremmer) April 20, 2023
a valiant effort from spacexpic.twitter.com/BmaOacrnmS
కాగా, 'స్టార్‌షిప్'పొడవు ఏకంగా 120 మీటర్లు(400 అడుగులు) ఉండటం గమనార్హం. ప్రస్తుతానికి దీన్ని టెస్ట్-ఫ్లైట్ కోసమే ప్రయోగించారు. చంద్రుడు, అంగారకుడిపై యాత్రలకు వీలుగా దీన్ని రూపొందించినట్లు సమాచారం. దాదాపు గంటన్నరపాటు సాగే టెస్ట్ ఫ్లైట్‌లో భాగంగా.. ప్రయోగం ప్రారంభమైన మూడు నిమిషాలకు బూస్టర్ విడిపోయి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో పడేలా రూపొందించారు. స్పేస్ క్రాఫ్ట్ మాత్రం భూమి చుట్టూ దాదాపు ఒక పరిభ్రమణం సాగించి, హవాయి సమీపంలో పడిపోయేలా తయారు చేశారు. గత సోమవారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా.. నేటికి వాయిదా వేశారు. అయితే, ఈ ప్రయోగం విఫలమైంది.
👨🏻🔧Never mistake trial for failure. As you say in #BocaChica, “it’s not an explosion, it’s just rapid unscheduled disassembly.” Congrats 😎 @SpaceX on this #Starship launch! #SpaceX pic.twitter.com/67Y3brzbgs
— Thomas Pesquet (@Thom_astro) April 20, 2023
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications