Tourism: ఆ దేశాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ టూరిస్టుల పిలుపు.. అసలేం జరిగిందంటే..

Spain: విదేశీ పర్యటనలు చేసే వారి సంఖ్య ఏటా పెరుగుతూ పోతోంది. ఎంతలా అంటే కొన్ని దేశాలకు పర్యాటకమే ఆదాయ వనరుగా మారింది. అయితే కొందరు టూరిస్టు వీసాపై వివిధ దేశాలకు వెళ్లి అక్కడే అక్రమంగా సెటిల్ కావడం, నేరాలకు పాల్పడటం చేస్తున్నారు. ఇది క్రమంగా తీవ్ర సమస్యగా మారింది. ఇలాంటి వివిధ రకాల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆయా దేశాలు కొత్త చట్టాలను ప్రవేశపెడుతున్నాయి. అయితే స్పెయిన్‌ నిబంధనలపై మాత్రం టూరిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తమ దేశాన్ని సందర్శించే పర్యాటకుల కోసం స్పెయిన్ ఓ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. అతిథులు బస చేయబోయే హోటల్స్, అద్దెకు తీసుకునే కారు సహా అనేక ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకోవడం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 2 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. ఎయిర్‌ బీఎన్బీ హోటల్స్‌లో నివసించే అతిథులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. ఇదికాస్తా తీవ్ర విమర్శలకు దారితీసింది.

Spain introduced new rules for tourists from Dec 2

బ్రిటీష్ హాలిడే మేకర్లకు స్పెయిన్ సుప్రసిద్ధ గమ్యస్థానంగా ఉండటంతో ముఖ్యంగా UK నుంచి వచ్చే పర్యాటకులు స్పెయిన్‌ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చకు దారితీసింది. వ్యవస్థీకృత నేరాలు మరియు ఉగ్రవాదం నుంచి తమ పౌరులను రక్షించడానికి అవసరమైన చర్యలుగా స్పానిష్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. అయితే స్పానిష్ హోటల్స్ అతిథుల ID కార్డ్‌లు లేదా పాస్‌పోర్ట్ వివరాలను అడుగుతున్నారు. వీటితోపాటు మొత్తం 31 వివరాలను సేకరిస్తున్నారు.

ఈ కొత్త నిబంధనలపై సోషల్ మీడియా వ్యాప్తంగా పర్యాటకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్పానిష్ దీవులను పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిస్తున్నారు. బదులుగా టర్కీకి వెళ్లమని సూచిస్తున్నారు. స్పెయిన్‌లో గడిపిన తమ సెలవులను అసహ్యించుకున్నట్లు పోస్టులు పెడుతున్నారు. నిబంధనలకు సంబంధించి పర్యాటకులకు ఎటువంటి శిక్షలు విధించరు కానీ పూర్తి డేటాను సేకరించకపోతే హోటల్స్‌కు భారీ జరిమానా విధించబడుతుంది.

Spain introduced new rules for tourists from Dec 2

ప్రభుత్వం నిబంధనల మేరకు పూర్తి పేరు, లింగం,జాతీయత, పాస్పోర్ట్ నంబర్, పుట్టిన తేదీ, ఇంటి చిరునామా, ల్యాండ్‌లైన్ ఫోన్ నంబర్, మొబైల్ ఫోన్ నంబర్, ఇమెయిల్ చిరునామాల వంటి పలు వివరాలను హోటల్ యజమానులు టూరిస్టుల నుంచి రాబడుతున్నారు. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు వారికి వీటి నుంచి మినహాయింపు ఉంది. కానీ వారితో ప్రయాణించే పెద్దలు తప్పనిసరిగా పిల్లలతో వారి రిలేషన్ వివరాలను పంచుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+