Viral Video: జూకు వెళ్తున్నారా అయితే.. ఈ వీడియో చూడాల్సిందే..
జూకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టమొచ్చినట్లు చేస్తే జంతువులకు ఆహారంగా మారుతాం. అప్పట్లో ఓ వ్యక్తి ఓ జూలో బోను వద్ద వెళ్లి అందులోని పులితో ఆడాడు. దీంతో పులి అతని చేయి కొరికేసింది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. అయితే ఇక్కడ పులి స్థానంలో స్పైడర్ కోతి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జుట్టు పట్టుకున్న కోతి..
ఓ జూలో అమ్మాయి తమ ఎన్‌క్లోజర్‌లను తాకడం వల్ల స్పైడర్ కోతి ఆమె జుట్టును పట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. వీడియోలో అమ్మాయి ఒక చేతిలో తన ఫోన్‌తో కోతుల ఎన్‌క్లోజర్‌ను సమీపిస్తున్నట్లు ఉంది. ఆమె కోతులను రెచ్చగొట్టడంతో ఓ కోతి ఆమె జుట్టు పట్టుకుని లోపలకి లాగింది.

కేకలు..
భయాందోళనకు లోనై బాలిక అరిచింది. కోతిని దూరంగా తరిమే ప్రయత్నంలో ఓ వ్యక్తి టీ-షర్టును ఊపుతూ కనిపించాడు. దీంతో కోతి ఆమెను విడిచిపెట్టింది. అయితే కొన్ని సెకన్ల తర్వాత ఆ అమ్మాయి మళ్లీ బోనులో ఉన్న కోతులను దాటుకుని వెళ్తుండగా, కోతి ఆమె జుట్టును మరోసారి పట్టుకుంది. అయితే ఆమె కేకలు వేయడంతో విడిచి పెట్టింది.

వేలిని కొరికిన సింహం..
ఈ వీడియో ఎక్కడ రికార్డయింది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సందర్శకులు జంతుప్రదర్శనశాలలో జంతువుల బోనుల బార్లను తాకవద్దని హెచ్చరిస్తున్నారు. జంతువులు బాగానే కనిపించినప్పటికీ, వాటికి దగ్గరగా ఉండటం మంచిది కాదన్నారు. కొద్ది రోజుల క్రితం జమైకాలోని ఒక జూకీపర్ తన చేతిని దూర్చినందుకు సింహం అతని వేలిని చీల్చింది
ఆటలొద్దు..
ఈ వీడియోపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. జూకు వెళ్తే జాగ్రత్తగా ఉండాలని ఒకరు. కోతులతో ఆట ఇలానే ఉంటుందని మరొకరు కామెంట్ చేశారు.












Click it and Unblock the Notifications