వామ్మో పెట్రో ధరల వాత.. లంకలో రూ.500 దాటిన లీటర్ పెట్రోల్ ధర.. డీజిల్ కూడా

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పీక్‌కి చేరింది. చమురు ధరలను ఆకాశాన్ని అంటున్నాయి. దీంతో అమెరికాకు చెందిన నిపుణులు లంక చేరుకున్నారు. ఆర్థిక సంక్షోభంపై చర్చిస్తున్నారు. ఇప్పుడు డీజిల్ రూ.460కి పలుకగా.. పెట్రోల్ ధర రూ.550 చేరుకుంది. చమురు నిల్వలు రావాల్సి ఉందని శక్తి ఉత్పాదకన మంత్రి ప్రకటించిన మరునాడే పెట్రో ధరలు ఆకాశ్మాని అంటాయి.

విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో పెట్రోల్, డీజిల్ దిగుమతులు తగ్గిపోయి.. తీవ్ర కొరత నెలకొంది. శ్రీలంక ప్రభుత్వం పెట్రోలియం సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ పెట్రోల్, డీజిల్ ధరలను 22 శాతం పెంచింది. లీటర్ పెట్రోల్ ధర రూ.550కు, డీజిల్ ధర రూ.460కి చేరాయి. బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో.. చాలా మంది ప్రజలు బంకుల ముందు నిల్చేనే పరిస్థితి ఏర్పడింది.

Sri Lanka hiked fuel prices. creating further pain for ordinary people.

ఆర్థిక సంక్షోభం వల్ల శ్రీలంక విదేశాల నుంచి చేసుకునే దిగుమతులకు డబ్బులు చెల్లించడం కష్టమైపోతుంది. భారత్ సహా వివిధ దేశాలు అందిస్తున్న రుణాలు, ఆర్థిక సాయంతో వెళ్లదీస్తోంది. కొద్దిగా చమురు దిగుమతులు జరుగుతున్నాయి. తాజా దిగుమతులు ఆలస్యం అవుతుండటంతో ధరలు పెంచాల్సి వచ్చింది. ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు సాయం చేయాలన్న విజ్ఞప్తి మేరకు అమెరికా ఆర్థిక, విదేశాంగ శాఖల అధికారులు శ్రీలంకలో పర్యటిస్తున్నారు.

శ్రీలంక చరిత్రలో దారుణమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ దేశానికి ఏమీ అవసరమో, ఎలాంటి సాయం చేస్తే బాగుంటుందనే అంశాలను అమెరికా బృందం పరిశీలిస్తోంది. ఆర్థిక వృద్ధికి తగిన సాయం అందించడంపై దృష్టి పెడుతున్నాం అని కొలంబోలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. ఇటు అమెరికా బృందం పర్యటిస్తున్న సమయంలో శ్రీలంక ప్రభుత్వం భారీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+