టాప్ దర్శకుడి కూతురు అరెస్టు.. పోర్న్ నటిగా మారిన కొద్దిరోజులకే..
ప్రపంచం మెచ్చిన దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ కూతురు మికేలా మరోసారి వార్తల్లో నిలిచారు. పోర్న్ స్టార్ గా ఎదగాలన్నది తన కల అని, ఆ మేరకు అడల్ట్ ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నానంటూ గతవారం సంచలన ప్రకటన చేసిన ఆమె.. గృహహింస కేసులో అడ్డంగా బుక్కైపోయింది. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రం, నాష్ విల్లేలో ప్రియుడితో కలిసుంటున్న ఆమెను శినవారం పోలీసులు అరెస్టు చేశారు.
పోర్న్ వీడియోలు చేయబోతున్ననంటూ ప్రకటించిన తర్వాత మికేలాతో ఇరుగుపొరుగు వైఖరి తేడాకొట్టిందని, కోపం పట్టలేని స్థితిలో ఆమె గృహహింసకు పాల్పడిందని, ఆ మేరకు అరెస్టు చేసిన పోలీసులు ఆమెను 12 గంటలపాటు స్టేషన్ లోనే ఉంచారని, అనంతరం బెయిల్ పై విడుదల చేశారని స్థానిక వార్తా సంస్థలు పేర్కొన్నాయ. మికేలా అరెస్టును ఆమె ప్రియుడు చక్ పాంకోవ్(50) కూడా ధృవీకరించారు. వెయ్యి డాలర్ల పూచికత్తుపై ఆమెను బయటికి తీసుకొచ్చినట్లు తెలిపారు.

తల్లిదండ్రుల అనుమతితోనే పోర్న్ రంగంలోకి వచ్చానని గతవారం ప్రకటించిన మికేలా.. ఈ వారంపాటు పలు సెక్స్ వీడియోల్లో నటించినట్లు తెలిసింది. వయసుమళ్లినవారితో శృంగారాన్ని ఇష్టపడతానన్న మికాలే.. సెక్స్ వీడియోల్లో మాత్రం సోలోగానే కనిపిస్తానని తెలిపింది. ప్రియుడు, కాబోయే భర్త పాంకోవ్ కూడా దీనికి సరేనన్నారని ఆమె చెప్పుకొచ్చింది. కూతురి అరెస్టుపై దర్శకుడు స్పీల్ బర్గ్ ఇంకా స్పందించలేదు. అనాధ అయిన మికేలాను స్పీల్‌బర్గ్ దంపతులు చాలా ఏళ్లకిందట దత్తత తీసుకున్నారు.












Click it and Unblock the Notifications