చైనా ఉక్కిరిబిక్కిరి - భారత్-అమెరికా దోస్తీ ఎఫెక్ట్ - శత్రుత్వ బీజాలు నాటొద్దంటూ అక్కసు
ప్రతిష్టాత్మక 'బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా)' అనుసరించాలని, ద్వైపాక్షిక, రక్షణ, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్-అమెరికాలు నిర్ణయించుకోవడంపై చైనా అక్కసు వెళ్లగక్కింది. సరిహద్దులో ఆగడాలను కొనసాగుతోన్న సమయంలోనే భారత్-అమెరికా మధ్య సాన్నిహిత్యం ఇంకాస్త పెరుగడంతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో భారత పర్యటన నేపథ్యంలో డ్రాగన్ అవాకులు పేలింది.

హైదరాబాద్ హౌజ్ వేదికగా..
అమెరికా రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ తో కలిసి భారత పర్యటనకు విచ్చేసిన విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మంగళవారం కీలక చర్చల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ వేదికగా 2+2 ఇండియా-యూఎస్ మినిస్టీరియల్ చర్చల్లో భాగంగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పొంపియో, ఎస్పర్ చర్చలు జరిపారు. ద్వైపాక్షిక రక్షణ, వ్యూహాత్మక సంబంధాలను పటిష్టపరచుకోవాలని నిర్ణయించడంతోపాటు ఇరు దేశాల మధ్య కీలకమైన ఒప్పందాలు కూడా కుదిరాయీ సమావేశంలో. దీనిపై..

చైనా దురాక్రమణలపై గుస్సా..
ఢిల్లీలో భారత్-అమెరికా మంత్రుల సమావేశం ఫలవంతంగా ముగిసిన తర్వాత పాంపియో మీడియాతో మాట్లాడుతూ, చైనా దురాక్రమణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాల్లో అమెరికా వెంట నిలుస్తుందని భరోసా ఇచ్చారు. దీనిపై డ్రాగన్ తనదైన శైలిలో స్పందించింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ మంగళవారం బీజింగ్ లో మీడియాతో మాట్లాడుతూ.. భారత్ పేరును ప్రస్తావించకుండానే తనకు, పొరుగుదేశాలకు మధ్య శత్రుత్వ బీజాలను అమెరికా నాటుతోందని ఆరోపించించారు.

పాంపియో.. ఆ మెంటాలిటీ వద్దు..
‘‘వెళ్లిన చోటల్లా చైనాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం పాంపియోకు కొత్తేమీ కాదు. ఆయన చెప్పే విషయాల్లో ఒక్కటి కూడా నిజం ఉండదు. అన్నీ నిరాధారమైన ఆరోపణలే. పొంపియో ఎల్లప్పుడూ ప్రచ్ఛన్న యుద్ధ మానసిక స్థితికి, సైద్ధాంతిక పక్షపాతానికి అంటిపెట్టుకుని ఉంటారు. కనీసం ఇకనైనా ఆయన కోల్డ్ వార్, జీరో-సమ్ గేమ్ మెంటాలిటీని వదిలిపెట్టాలి. చైనాకు, దాని చుట్టుపక్కల దేశాలకు మధ్య శత్రుత్వ బీజాలను నాటడం ఆపాలని. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతలకు విఘాతం కల్పించే పనులను అమెరికా మానుకోవాలి'' అని వాంగ్ వెన్ బిన్ వార్నింగ్ ఇచ్చారు.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications