సలాం కొట్టాల్సిందే: ఐదేళ్ల బుడ్డోడు అమెరికా మొత్తాన్ని ఆలోచనలో పడేశాడు..
తన సహచరుడైన నల్లజాతి బాలుడి పట్ల అతను చూపించిన ప్రేమ అమెరికా మొత్తానికి ఆదర్శంగా నిలుస్తోంది.
వాషింగ్టన్: అమెరికాలో జాత్యహంకార దాడులు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో ఓ ఐదేళ్ల చిన్నోడు చూపిన మానవత్వం ప్రతీ ఒక్కరిని కదిలిస్తోంది. తన సహచరుడైన నల్లజాతి బాలుడి పట్ల అతను చూపించిన ప్రేమ అమెరికా మొత్తానికి ఆదర్శంగా నిలుస్తోంది.
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. అమెరికాలోని కెంటూకీ నివాసి అయిన శ్వేత జాతి బాలుడు జాక్స్(5)కు తనతో పాటు చదివే నల్లజాతి బాలుడు రెడ్డి గిగిల్(5) అంటే అమితమైన ఇష్టం. గిగిల్ లాగే తానూ హెయిర్ స్టైల్ చేయించుకుని క్లాస్ రూమ్ లోకి అడుగుపెట్టాడు.
జాక్స్ ను చూసి అతని టీచర్లు ఆశ్చర్యానికి లోను కాగా.. తానెందుకు అలా చేసింది వారికి వివరించారు. ఇప్పుడు తాను, గిగిల్ ఒకేలా ఉన్నామని, మా మధ్య తేడా ఏమి లేదు కదా అని అడిగాడు. జాక్స్ ఈ మాటలు చెబుతుండగానే గిగిల్ సంతోషంతో అతన్ని ఆలింగనం చేసుకున్నాడు.

అంతకుముందు తన హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి తల్లితో జాక్స్ మాట్లాడాడు. తానెందుకు అలా చేయాలనుకుంటున్నాడో తల్లికి చెప్పాడు. దీంతో తల్లి కూడా అందుకు ఓకె చెప్పింది. జాక్స్ ఈ హెయిర్ స్టైల్ చేయించుకోవడానికి ముందు స్పైక్స్ తో స్టైలిష్ గా ఉండేవాడు. అయితే మిత్రుని కోసం జాక్స్ తన హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకుని.. అతని లాగే ఉండాలని నిర్ణయించుకోవడం అందరినీ ఆకట్టుకుంది.
నల్లజాతి వారు శ్వేతజాతి వారు వేరు కాదని, అంతా ఒక్కటేనని చెప్పాలనుకోవడం జాక్స్ ఉద్దేశం. దీనికి సంబంధించిన వీడియోను ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో ఇప్పుడు ఈ బుడ్డోడి గురించి అమెరికా అంతా మాట్లాడుకుంటోంది. మొత్తం మీద జాక్స్ చేసిన ఈ పనికి జాత్యహంకారంతో విర్రవీగేవారు బుద్ది తెచ్చుకోవాల్సిన అవసరముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications