Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sunita Williams: అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే వచ్చే ఆరోగ్య సమస్యలు ఇవే..

Sunita Williams: దాదాపు తొమ్మిది నెలలు అంతరిక్షంలో గడిపిన తర్వాత నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి మీదకు తిరిగి వచ్చారు. వారిద్దరూ గత సంవత్సరం జూన్ 2024లో బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో రోదసిలోకి చేరుకున్నారు. కానీ అంతరిక్ష నౌకలో సాంకేతిక లోపం కారణంగా తిరిగి రాలేకపోయారు. తాజాగా స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్రాఫ్ట్ అంతరిక్ష నౌక ఆదివారం నలుగురు వ్యోమగాములతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ(బుధవారం) తెల్లవారుజామున 3,27 గంటలకు ఫ్లోరిడా సముద్ర జలాల్లో స్పేస్ క్యాప్సూల్ ల్యాండ్ అయింది. భూమికి దూరంగా ఉన్న ప్రపంచం నుంచి దాదాపు 290 రోజులు గడిపిన తర్వాత ఇద్దరూ తిరిగి భూమిని చేరుకున్నారు.

ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలో తేలియాడడం మనకు సరదాగా అనిపించొచ్చు. కానీ గురుత్వాకర్షణ శక్తి లేమి వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎముకలు, కండరాల సాంద్రత తగ్గిపోవడంతో వారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భూమికి తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు గురుత్వాకర్షణ శక్తికి తిరిగి అలవాటు పడడం చాలా కష్టమే. కనీసం నిలబడాలంటే కూడా కొన్ని నెలల సమయం పడుతుంది. భూమి మీద జీవనానికి అలవాటు పడాలంటే వారికి కొన్ని వారాల సమయం పడుతుంది.

భూమికి తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు ఎదుర్కొనే ఆరోగ్య సవాళ్లు ఏమిటి?

అంతరిక్షంలో, భూమిపై జీవితం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అంతరిక్ష ప్రయాణం అనేది ఒక అసాధారణ అనుభవం. దీని కోసం వ్యోమగాములకు ముందుగానే శిక్షణ ఇస్తారు. అయితే కొన్ని పరిస్థితులలో అంతరిక్షంలో ఎక్కువ కాలం గడపడం వల్ల తీవ్రమైన ఆరోగ్య పరిణామాలు ఉంటాయి. వ్యోమగాములు గురుత్వాకర్షణ లేమిలో ఎక్కువ కాలం గడపడం వల్ల గణనీయమైన శారీరక, మానసిక మార్పులకు లోనవుతారు. అంతరిక్షంలో సమయం గడపడం ఎంత కష్టమో.. భూమికి తిరిగి రావడం కూడా అంతే కష్టం. గురుత్వాకర్షణ శక్తి లేకుండా వ్యోమగాముల శరీరం బరువులేని స్థితికి అలవాటు పడుతుంది. భూమికి తిరిగి వచ్చిన తర్వాత శరీరం భూమి గురుత్వాకర్షణ శక్తికి సర్దుబాటు కావడానికి నెలలు పట్టవచ్చు. ఈ కాలంలో వారు అనేక ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

Sunita Williams Butch Wilmore returned to Earth Health Issues Faced After Prolonged Stay in Space

ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు?

మైక్రోగావిటీ అనంతరం మళ్లీ గురత్వాకర్షణలోకి తిరిగి రావడం అనేది.. అలసట, నడవడంలో ఇబ్బంది, శరీర సమతుల్యతను కాపాడుకోవడం ఒక సవాలు కంటే తక్కువ కాదని వైద్య నివేదికలు చూపిస్తున్నాయి. మైక్రోగావిటీలో కండరాలు భూమిపై ఉన్న విధంగా భారాన్ని భరించలేవు. అంటే సునీత రాబోయే కొన్ని నెలలు కండరాల క్షీణతతో కూడా బాధపడవచ్చు. కండరాల క్షీణతతో కండర కణజాలాలు చాలా వీక్ గా మారుతాయి. దీని వల్ల నిలబడడం, నడవడం, బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమవుతుంది.

బేబీ ఫీట్
భూమికి తిరిగి వచ్చిన తర్వాత శరీర సమతుల్యతను కాపాడుకోవడం చాలా కష్టం కాబట్టి ఎక్కువసేపు నడవడంలో ఇబ్బంది పడతారు. వ్యోమగాములు పాదాల్లోని దళసరిగా ఉండే చర్మాన్ని కోల్పోతారు. ఈ క్రమంలో పసిపిల్లల్లో ఉన్నట్లు వారి పాదాలు మృదువుగా తయారై నడవడం కష్టమవుతుంది. వారి పాదాల చర్మం తిరిగి గట్టిగా అయ్యేవరకు నడవడం చాలా బాధాకరంగా ఉంటుంది.

ఆరోగ్య సంబంధిత సమస్యలు
వ్యోమగాముల ఎముకలు బలహీనంగా, పెళుసుగా మారుతాయి. దీని వల్ల కొన్ని నెలల పాటు వారు వృద్ధాప్య దశను అనుభవించాల్సి ఉంటుంది. అంతరిక్షంలో ఉండడం వల్ల గుండె, మెదడు, రక్త ప్రసరణ వ్యవస్థ కూడా ప్రభావితమవుతాయి. అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తి మెదడులోని ద్రవం మొత్తాన్ని పెంచుతుంది. వ్యోమగాముల శరీర ఎగువ భాగంలో సాధారణం కన్నా ఎక్కువగా రక్తం, ద్రవాలు పేరుకుపోతాయి. దీంతో వ్యోమగాములు ఉబ్బిపోయినట్లు కనిపిస్తారు. తలలోని రక్తం, ద్రవాలు పేరుకుపోతాయి. దీంతో వినికిడి సమస్యకు దారితీసే అవకాశం ఉంటుంది. అంతరిక్షంలో గుండె ఆకృతి కూడా మారుతుంది. కండరాల క్షీణత వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో భూమికి తిరిగొచ్చాక బీపీని నియంత్రించడం కష్టమవుతుంది.

ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది..
భూకక్ష్యంలోని రేడియోధార్మికత కారణంగా వ్యోమగాముల్లో తెల్లరక్త కణాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దీని కారణంగా వారిలో రోగనిరోధక వ్యవస్థ బలహీన పడే ప్రమాదం ఉంది. దీని కారణంగా పలు వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయి.

కంటిచూపు, నిలకడపై ప్రభావం

రోదసిలో ఎక్కువ కాలం ఉండడం వల్ల వెస్టిబ్యులర్ ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. చెవిలోని ఈ వెస్టిబ్యులర్ అవయవం.. గురుత్వాకర్షణకు సంబంధించిన సమాచారాన్నిమెదడుకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భూమి మీద నడిచేటప్పుడు ఇది మనిషిని తుళ్లిపడిపోకుండా స్థిరంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ వల్ల వెస్టిబ్యులర్ అవయవాలకు అందే సమాచారం మారిపోతుంది. ఈ క్రమంలో మెదడులో అయోమయ పరిస్థితి స్పేస్ వీక్ నెస్ కు దారితీయవచ్చు. దీని వల్ల కళ్లు తిరగడం, తలనొప్పి, కడుపులో వికారం, వాంతులు వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అంతరిక్షంలో ప్రయాణించిన వ్యోమగాముల తలభాగంలో అధికంగా చేరే ద్రవాల్లో కొంత వరకు కంటి వెనుక భాగంలో తిష్టవేయవచ్చు.ఈ నేపథ్యంలో దృష్టి లోపాలు కూడా సంభవించవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+