Bashar al-Assad: సిరియా అధ్యక్షుడు అస్సాద్ విమానం కూల్చివేత ?

సిరియాలో రెబెల్స్ దాడుల నేపథ్యంలో దేశం వదిలి పారిపోయిన అధ్యక్షుడు బషర్ -అల్ అస్సాద్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది. అస్సాద్ ప్రయాణిస్తున్న విమానం తొలుత రష్యాకు వెళ్తున్నట్లు గుర్తించిన అంతర్జాతీయ ప్లైట్ ట్రాకర్స్ .. ఆ తర్వాత అతి హఠాత్తుగా ట్రాకర్ నుంచి దారి తప్పి అదృశ్యమైనట్లు గుర్తించారు.

ఇంత హఠాత్తుగా విమానం ట్రాకర్ నుంచి అదృశ్యం కావడాన్ని బట్టి చూస్తే అది కచ్చితంగా కుప్పకూలి ఉంటుందని భావిస్తున్నారు.

Syrian President Bashar al-Assad s plane crashed sudden disappearance suggests shot down

అంతకు ముందు సిరియాలో రెబెల్స్ , మిలీషియా గ్రూపులు రాజధాని డెమాస్కస్ ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించాయి. రాజధానిలోకి ప్రవేశిస్తున్నట్లు తిరుగుబాటుదారులను ఎదుర్కునే పరిస్ధితి లేకపోవడంతో అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ దేశం వదిలి పారిపోయారు. డెమాస్కస్ ఎయిర్ పోర్టు నుంచి అధ్యక్షుడు అస్సాద్ విమానం గాల్లోకి ఎగరగానే ఓ అధ్యాయం ముగిసిందని రెబెల్స్ ప్రకటించారు. దీనిపై స్పందించిన ప్రధాని మహ్మద్ ఘాజీ అల్-జలాలీ.. అధికారాన్ని అప్పగించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. అటు సైన్యం, భద్రతా దళాలు డమాస్కస్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని విడిచిపెట్టినట్లు పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.

మరోవైపు డమాస్కస్ నుంచి బయలుదేరిన అస్సాద్ విమానం కొద్దిసేపు ప్రయాణించాక రాడార్ నుండి అదృశ్యమైంది. అక్కర్‌కు ఉత్తరాన లెబనాన్ గగనతలం బయట కొన్ని నిమిషాల్లోనే 3,650 మీటర్ల ఎత్తు నుండి 1,070 మీటర్ల ఎత్తుకు అకస్మాత్తుగా పడిపోయింది. దీంతో బషర్ అల్-అస్సాద్ ప్రయాణిస్తున్నట్లు అనుమానిస్తున్న విమానం 3D ఫ్లైట్ రాడార్ డేటా అది క్రాష్ అయినట్లు చూపిస్తోంది. ఈ నేపథ్యంలో రెబెల్స్ లేదా అస్సాద్ ప్రత్యర్థులు ఈ విమానాన్ని కూల్చేశారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+