బికినీ వేసుకున్న ముద్దుగుమ్మ.. బీచ్‌లో అలా తిరగొద్దని ఫైన్..!
మనీలా : బీచుల్లో అరకొర దుస్తులు వేసుకుని తిరగడం కామన్. ఒంటి నిండా దుస్తులు కనబడటం బీచుల్లో తక్కువే అని చెప్పొచ్చు. అలాంటిది బీచ్‌లో ఓ మహిళ బికినీ వేసుకుని తిరిగిందనే కారణంగా ఫైన్ పడింది. ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సరదాగా గడుపుదామని బీచ్‌కు బికినీ ధరించి వెళితే ఫైన్ వేయడమేంటనే చర్చ జరుగుతోంది. అయితే అక్కడ కొన్ని పద్దతుల కారణంగా వస్త్రధారణ విషయంలో పరిమితులు ఉన్నాయి.
బికినీ ధరించిందనే కారణంతో తైవాన్ పర్యాటకురాలిని ఫిలిప్పీన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. 26 ఏళ్ల వయసున్న లింటు టింగ్ హాలిడే వేకెషన్స్‌కు తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఫిలిప్పీన్స్ పర్యటనకు వెళ్లింది. ఆ క్రమంలో ఈ నెల 9వ తేదీన బొరాకే ద్వీపంలోని ఓ బీచ్ సందర్శనకు జంటగా వెళ్లారు. అయితే ఆ బీచ్‌కు వెళ్లేముందు బికినీ ధరించింది సదరు యువతి. అప్పటికే హోటల్ సిబ్బంది ఆమెను వారించారు. ఆమె వేసుకున్న బికినీ అభ్యంతరకరంగా ఉందని.. అలా బీచ్‌కు వెళితే సమస్యలు వస్తాయని హెచ్చరించారు.

హోటల్ సిబ్బంది హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అలాగే బీచ్‌కు వెళ్లింది. అంతేకాదు లెక్కకు మించి ఫోటోలు దిగి నెట్టింట పోస్ట్ చేసింది. అయితే అవి కాస్తా వైరల్ కావడంతో బొరాకే ఇంటర్ ఏజెన్సీ రిహాబిలిటేషన్ మేనేజ్‌మెంట్ గ్రూప్ సభ్యుల దృష్టిలో పడ్డాయి. ఇంకేముంది సదరు యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బికినీ ధరించి ఫిలిప్పీన్స్ సంస్కృతికి భిన్నంగా వ్యవహరించారనేది వారి వాదన. ఆ క్రమంలో ఆ యువతి బస చేసిన హోటల్‌కు వెళ్లి అరెస్ట్ చేశారు. కొంత మొత్తంలో జరిమానా కూడా విధించారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications