వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హక్కానీలకు తాలిబన్లు మరో సాయం-తీవ్రవాద బ్లాక్ లిస్ట్ లో నుంచి తప్పించాలని అమెరికాపై ఒత్తిడి

|
Google Oneindia TeluguNews

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో తాలిబన్లు అధికార పగ్గాలు చేజిక్కించుకోవడంతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. నిన్న మొన్నటివరకూ తీవ్రవాదులుగా చెలామణి అయిన వారంతా ఇప్పుడు తాలిబన్లకు ఆప్తులుగా మారిపోతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ సిఫార్సుతో తీవ్రవాద గ్రూపు అయిన హక్కానీ నెట్ వర్క్ నేత సిరాజుద్దీన్ కు తమ ప్రభుత్వంలో చోటిచ్చిన తాలిబన్లు.. ఇప్పుడు మరో సాయానికి సిద్దమయ్యారు.

పాకిస్తాన్ సిఫార్సు మేరకు తమ ప్రభుత్వంలో హక్కానీలకు చోటు ఇచ్చిన తాలిబన్లు.. ఇప్పుడు వారిపై ఉన్న తీవ్రవాద ముద్రను తొలగించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆమెరికా బ్లాక్ లిస్ట్ లో ఉన్న వారిని అందులో నుంచి తప్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు అమెరికాపై తాలిబన్లు ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. అమెరికా బ్లాక్ లిస్ట్ లో ఉంటే భవిష్యత్తులో హక్కానీలకు, తద్వారా తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్న తాలిబన్లు.. ఇందుకోసం వారిని బయటపడేసే యత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు.

Talibans pressure US for haqqanis to be Removed from their Blacklist

అమెరికా తాజా బ్లాక్ లిస్ట్ ప్రకారం హక్కానీలను అందులో ఉంచడం గతంలో తమతో కుదుర్చుకున్న దోహా ఒప్పందానికి వ్యతిరేకమని తాలిబన్లు చెప్తున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్స్ ప్రభుత్వం (తాలిబన్ల సర్కార్ )తో పాటు హక్కానీ కుటుంబ సభ్యుల విషయంలో అమెరికా వైఖరి తమకు ఆమోదయోగ్యం కాదని తాలిబన్లు ప్రకటించారు. ఇది దోహాలో గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. హక్కానీ కుటుంబం ఇస్లామిక్ ఎమిరేట్స్ లో భాగమని, వారికి ప్రత్యేక సంస్ధ ఏదీ లేదని తాలిబన్లు చెప్తున్నారు. కాబట్టి అమెరికా బ్లాక్ లిస్ట్ లో నుంచి వారిని తప్పించాల్సిందేనంటున్నారు.

హక్కానీలను అమెరికా బ్లాక్ లిస్ట్ లో ఉంచడం తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్లేనని తాలిబన్లు చెప్తున్నారు.
భవిష్యత్తులో తమతో దౌత్య సంబంధాలు కావాలంటే అమెరికా కచ్చితంగా తమ కేబినెట్ లో చేరుతున్న నలుగురు హక్కానీ కుటుంబ సభ్యుల్ని బ్లాక్ లిస్ట్ నుంతి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అమెరికా కూడా ఎటూ తేల్చుకోలేకపోతోంది. హక్కానీ నెట్ వర్క్ సభ్యులు తాలిబన్ల సర్కార్ లో చేరారన్న కారణంతో వారిని బ్లాక్ లిస్ట్ నుంచి తప్పిస్తే భవిష్యత్తులో మిగతా ఉగ్రవాద సంస్ధల నుంచి ఇదే డిమాండ్ వినిపిస్తుందని అమెరికా భయపడుతోంది.

English summary
the talibans has made pressure on US to remove haqqani network leaders who are in blacklist.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X