వచ్చేస్తోంది.. ఇక పాకిస్థాన్, చైనాకు రప్పా.. రప్పా..

భారత్ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం అవుతోంది. సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాలో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యాధునిక యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్ వ్యవస్థలను సమకూర్చుకుంటోంది భారత్. మనదేశంలోనే స్వదేశీ టెక్నాలజీతో తయారైన అత్యాధునిక ఫైటర్ జెట్ ఈ నెల చివరినాటికి భారత అమ్ముల పొదిలో చేరనుంది.

భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో ఎప్పుడూ ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాల నేపథ్యంలో రక్షణ రంగంపై భారీగా ఖర్చు చేస్తోంది కేంద్ర రక్షణ శాఖ. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలను స్వదేశీ టెక్నాలజీ సాయంతో తయారు చేస్తోంది. అటు పాకిస్థాన్ తో ఉద్రిక్తతల దృష్ట్యా భారత్ రక్షణ రంగంపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అత్యాధునిక, శక్తివంతమైన ఆయుధాలను భారత అమ్మల పొదిలోకి చేర్చుతోంది. తాజాగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL) రూపొందించిన తేజస్- 1A ఫైటర్ జెట్ సిద్దం అవుతోంది. ప్రస్తుతం నాసిక్ లోని కార్మాగారంలో తుది మెరుగులు దిద్దుకుంటోంది.

లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్(LCA) మోడల్ లోనే అత్యాధునిక ఫైటర్ జెట్ గా తేజస్- 1A కు గుర్తింపు ఉంది. మల్టీరోల్ ఫ్రంట్ లైన్ ఫైటర్ గా దీన్ని తయారు చేశారు. అత్యాధునిక కట్టింగ్ ఎడ్జ్ సెన్సార్స్ ఈ ఫైటర్ జెట్ సొంతం. ఎలక్ట్రిక్ వార్ ఫేర్ తో పాటు మల్టీరోల్ కంబాట్ సామర్థ్యం ఈ ఫైటర్ జెట్ సొంతం. ఈ నెల చివరి నాటికి భారత వైమానిక దళానికి ఈ ఫైటర్ జెట్ ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అందించనుంది.

Tejas-1A Set to Soar HAL Gears Up for IAF Induction by July 2025

నాలుగేళ్ల క్రితం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్ లో భాగంగా 83 తేజస్ ఎంకే- 1ఏ ఫైటర్ జెట్స్ ను రూ. 67 వేల కోట్లకు తయారు చేయాలని ఒప్పందం చేసుకున్నారు. వచ్చే పదేళ్ల పాటు ఇవి వైమానిక రంగంలో విశేష సేవలు అందించనున్నాయి. ఇవి లాంగ్ రేంజ్ నుంచే అనేక టార్గెట్ లను ఛేదించగలవు.

ఈ ఫైటర్ జెట్స్ లో యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్ డ్ అర్రే (AESA) అనే రేడార్ ను అమర్చారు. ఈ రేడార్ సాయంతో లద్ధాఖ్, కాశ్మీర్ లాంటి ప్రతికూల వాతావరణం కలిగిన ప్రాంతాల్లోనూ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ ఫైటర్ జెట్ లో డిజిటల్ కాక్ పిట్ ను అమర్చారు. అంతేకాక స్మార్ట్ మల్టీ ఫంక్షన్ డిస్ ప్లే, డిజిటల్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్ పరికరాలను కూడా అమర్చారు. ఈ ఫైటర్ జెట్ రాకతో సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనా అలెర్ట్ అయ్యాయి.

మరోవైపు అమెరికా నుంచి మూడు అపాచీ హెలికాప్టర్లు త్వరలో భారత్ లోకి రానున్నాయి. దీంతో భారత్ డిఫెన్స్ రంగం మరింత శక్తివంతంగా మారినట్లు చెప్పవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి అపాచీ హెలికాప్టర్ల కోసం భారత్ ఎదురుచూస్తోంది. ఎట్టకేలకు ఈ నెలలోనే ఇవి భారత్ లోకి అడుగు పెట్టనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+