వీడియో: తేజస్ ఫైటర్ జెట్ కుప్పకూలడానికి కారణం అదేనా..?

యూఏఈలోని దుబాయ్ వరల్డ్ సెంట్రల్(DWC)లో అట్టహాసంగా జరుగుతున్న దుబాయ్ ఎయిర్ షో- 2025 కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దుబాయ్ ఎయిర్ షోలో భాగంగా విన్యాసాలు చేస్తున్న భారత్ కు చెందిన తేజస్ యుద్ధ విమానం ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగ ఎగిసిపడింది. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

దుబాయ్ ఎయిర్ షో- 2025 కార్యక్రమంలో అందరూ తేజస్ ఫైటర్ జెట్ యుద్ధ విన్యాసాలు చూస్తుండగా ఒక్కసారిగా ఈ ఘటన జరిగింది. యుద్ధవిమానం కుప్పకూలడంతో అక్కడి ప్రాంతం అంతా దట్టమైన నల్లని పొగతో నిండిపోయింది. వెంటనే ఆ ప్రాంతంలోని సైరన్ లు మోగాయి. అయితే ఈ ఘటనపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్పందించింది. కోర్ట్ ఆఫ్ ఎన్ క్వైరీకి ఆదేశాలు ఇచ్చింది. అల్ మక్ టౌమ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల 49 నిమిషాలకు ఈ ఘటన జరిగింది.

Tejas Tumble at Dubai IAF Launches Court of Inquiry into Fighter Jet Crash

ఈ ప్రమాదంలో పైలట్ మృతి చెందినట్లు IAF అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఫైలట్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఈ ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎన్ క్వైరీకి ఆదేశించినట్లు IAF తెలిపింది. అయితే ఈ ఘటనకు సంబంధించి.. పైలట్ నెగిటివ్ జీ టర్న్ తీసుకునే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం అందుతోంది. పైలట్ కు విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు నెగటివ్ జీ వాడతారని తెలుస్తోంది. ఇక తేజర్ ఫైటర్ జెట్స్ కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి ఎంతో సమర్థవంతమైన ఫైటర్ జెట్స్ అని పేరుంది. గత 24 ఏళ్లలో రెండుసార్లు మాత్రమే ఇవి కుప్పకూలిపోయాయి.

చివరిసారిగా 2024 మార్చి 12 న రాజస్థాన్ లోని జైసల్మేర్ లో ఓ తేజర్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఇలా 20 నెలల్లో తేజస్ జెట్ కుప్పకూలడం ఇది రెండోసారి. ఇక దుబాయ్ ఎయిర్ షో రెండేళ్లకోసారి నిర్వహిస్తారు. చివరగా 2023లో నిర్వహించారు. నవంబర్ 13 నుంచి 17 వరకు ఈ కార్యక్రమం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+