టెలిగ్రామ్ ఫౌండర్, బిలియనీర్ అరెస్ట్..!!
Paul Durov arrest: టాప్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పాల్ దురోవ్ అరెస్ట్ అయ్యారు. ఫ్రాన్స్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పారిస్‌లోని లె బౌర్గెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే అరెస్ట్ చేశారు. నేడు ఆయనను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
అంతర్జాతీయ స్థాయిలో చీటింగ్, మనీలాండరింగ్, మాదక ద్రవ్యాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, చిన్నపిల్లలపై లైంగికదాడులకు సంబంధించిన నేరాలను అరికట్టేలా/వాటిని నిరోధించేలా టెలిగ్రామ్ యాప్‌లో ఎలాంటి అప్‌డేట్ చేయకపోవడం, ఆ స్థాయిలో దాన్ని ఆధునికీకరించకపోవడమే పాల్ దురెల్ అరెస్ట్‌కు కారణమైంది.

ఆయనకు ఇదివరకే నాన్ బెయిలబుల్ అరెస్ట్ జారీ చేసింది ఫ్రాన్స్ అత్యున్నత న్యాయస్థానం. దీన్ని నుంచి తప్పించుకోవడానికి కొద్దిరోజులుగా ఫ్రాన్స్ వెళ్లట్లేదు పాల్ దురెల్. ఆ దేశ కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8 గంటలకు తన సొంత ఫ్లైట్‌లో అజర్‌బైజన్ నుంచి పారిస్‌కు తిరిగివచ్చిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
39 సంవత్సరాల పాల్ దురెల్ జన్మతః రష్యన్. ఆయనకు ఫ్రాన్స్‌లో పౌరసత్వం ఉంది. 2014లో ఆయన రష్యాను విడిచిపెట్టారు. ఫ్రాన్స్‌లో నివసిస్తోన్నారు. 15.5 బిలియన్ డాలర్లతో ఫార్చున్ అపర కుబేరుల జాబితాలో సైతం ఆయనకు చోటు దక్కింది.
తాము అభివృద్ది చేసిన వికోంటాక్టె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌కు పోటీగా టెలిగ్రామ్ యాప్‌ను రూపొందించారని, వెంటనే దీని కార్యకలాపాలను నిలిపివేయాంటూ రష్యా ప్రభుత్వం డిమాండ్ చేయడంతో పాల్ దురెల్ స్వదేశానికి దూరం అయ్యారు. దేశాన్ని విడిచిపెట్టారు.












Click it and Unblock the Notifications