బంగారం ఇటుకలతో వధువు తులాభారం.. వీడియో చూస్తే నోరెళ్ళబెట్టటం ఖాయం
బంగారు ఇటుకలతో వధువును తూచి వరుడికి ఆ బంగారం ఇటుకలను వరకట్నంగా ఇచ్చి ఆశ్చర్యపరిచే వీడియో వైరల్ అవుతుంది.
సాధారణంగా పెళ్లి అట్టహాసంగా చేయడం అనేక సందర్భాల్లో విని ఉంటాం. భారీ సెట్టింగులతో, భారీ మండపాలతో, లక్షల మందిని పిలిచి.. ఇంత ఘనంగా భోజనం పెట్టారంటే.. ఇంత ఘనంగా బహుమతులు ఇచ్చారు అంటూ పెళ్లిళ్లు బాగా జరగడంపై చర్చించుకుంటాం. కానీ అవాక్కయ్యేలా జరిగే కొన్ని పెళ్లిళ్లు కూడా ఉంటాయి.. వామ్మో అని అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యేలా జరుగుతున్న పెళ్లిళ్లు కూడా ఇటీవల కాలంలో కనిపిస్తున్నాయి.

బంగారం ఇటుకలతో వధువు తులాభారం
ఇక తాజాగా దుబాయ్ లో అటువంటి పెళ్లి అక్కడికి వచ్చిన వారందరికీ ఇళ్లకు వెళ్లిన తర్వాత కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఇంతకీ ఆ పెళ్లిలో ఏం జరిగింది అంటే.. దుబాయ్ లో జరిగిన ఒక పెళ్లి కోటీశ్వరులను కూడా టెన్షన్ పెట్టింది. సంపన్న వర్గాలు సైతం అవాక్కయ్యేలా జరిగిన ఆ పెళ్లిలో పెళ్లికి వచ్చిన అతిధులందరూ అక్కడ జరిగిన తంతు చూసి నోరెళ్లపెట్టారు. బాగా సౌండ్ పార్టీ అయిన సదరు పెళ్లికూతురు తండ్రి పెళ్లికూతురుని నిలువెత్తు బంగారంలో తూచి వరుడుకి కట్నంగా అప్పజెప్పాడు.

70కిలోల బంగారం ఇటుకలు వరుడికి గిఫ్ట్
బంగారపు ఇటుకలను త్రాసు లో వేసి కూతురు బరువుని బంగారంతో తూచాడంటే అతను మామూలు వాడు కాదని అక్కడికి వచ్చిన వాళ్ళందరూ చర్చించుకున్నారు. దుబాయ్ లో స్థిరపడిన ఓ పాకిస్తానీ వ్యాపారి అయిన తండ్రి తన కుమార్తె పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించడంలో భాగంగా వరకట్నంగా తన కుమార్తెను బంగారపు ఇటుకలతో తులాభారం వేసి ఆ బంగారాన్ని వరుడుకి ఇచ్చారు. ఇక అమ్మాయి ఏమన్నా స్లిమ్ గా ఓ నలభై.. నలభై ఐదు కిలోలు బరువు ఉంది అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే .. అమ్మాయి ఏకంగా 70 కిలోల బరువు ఉంది.
పెళ్ళికి వచ్చిన వాళ్ళంతా షాక్..
మొత్తం 70 కిలోల బరువున్న బంగారు ఇటుకలను చేయించి కుమార్తెను తూచి, అంత బంగారాన్ని వరుడుకి గిఫ్ట్ గా ఇచ్చారు. ఇక అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ సీన్ చూసి ఇళ్లకు వెళ్లిన తర్వాత కూడా నిద్రపోలేని పరిస్థితి ఆ పెళ్లి వేడుక ఎంతగా షాక్ ఇచ్చిందో అర్థమయ్యేలా చెబుతుంది. ఇక ఇప్పుడు బంగారం ధరలు విపరీతంగా పెరిగిన నేపధ్యంలో వధువు తండ్రి బంగారం ఇటుకలను వరకట్నంగా ఇవ్వటం చర్చకు కారణం అయ్యింది.












Click it and Unblock the Notifications