మానవ మెదడులో తొలి న్యూరాలింక్ చిప్.. ఎలాన్ మస్క్ ప్రయోగం సక్సెస్ అయితే అద్భుతమే!!
మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని చెప్పే రోజులు పోయి టెక్నాలజీతో మనిషి జీవితాన్నే మార్చొచ్చు, దేనినైనా సాధ్యం చేయొచ్చు అని చెబుతున్న రోజులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. నేరుగా మనిషి మెదడు కంప్యూటర్ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడం లక్ష్యంగా టెస్లా దిగ్గజం, న్యూరో టెక్నాలజీ కంపెనీ సహవ్యవస్థాపకుడు గా ఉన్న ఎలాన్ మస్క్ చేసిన ప్రయోగం 'న్యూరాలింక్' ఆశాజనకమైన ఫలితాలను ఇస్తోందని తెలుస్తోంది.
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని న్యూరా లింక్ తన మొదటి చిప్ ను మానవ మెదడులో అమర్చినట్లు, అది బాగా పని చేస్తున్నట్టు, ప్రారంభ ఫలితాలు ఆశాజనకంగా చూపిస్తున్నట్టు వెల్లడించింది. ఇక ఈ విషయాన్ని ఎలాన్ మస్క్ కూడా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఆదివారం నాడు మొదటిసారి ఒక పేషంట్ మెదడులో న్యూరా లింక్ చిప్ ను అమర్చింది.

మస్క్ యొక్క బ్రెయిన్ చిప్స్ స్టార్టప్ అమెరికా నియంత్రణ సంస్థ నుండి గత సంవత్సరం తన మొదటి మానవ ట్రయల్ నిర్వహించడానికి అనుమతిని సాధించింది. మస్క్ యొక్క మొదటి న్యూరాలింక్ ఉత్పత్తిని టెలిపతి అని పిలుస్తారు. ఈ చిప్ మానవ మెదడులో ఇంప్లాంట్ చేయడం కేవలం ఆలోచించడం ద్వారా మీ ఫోన్, కంప్యూటర్ లేదా ఏదైనా పరికరం నియంత్రణను ప్రారంభిస్తుందని చెబుతున్నారు.
Enables control of your phone or computer, and through them almost any device, just by thinking.
— Elon Musk (@elonmusk) January 30, 2024
Initial users will be those who have lost the use of their limbs.
Imagine if Stephen Hawking could communicate faster than a speed typist or auctioneer. That is the goal.
మనిషి సామర్థ్యాలను ఉత్తేజం చేయడం, పార్కిన్సన్ వంటి నాడీ సంబంధిత వ్యాధులకు చికిత్స ప్రధాన లక్ష్యాలుగా ఈ ప్రయోగం ప్రస్తుతం కొనసాగుతోంది. కృత్రిమ మేధస్సుకు, మానవ జీవనానికి సహజీవన సంబంధాన్ని సాధించటం లక్ష్యంగా ఈ ప్రయోగాన్ని చేస్తున్నారు. ఈ చిప్ ద్వారా శరీర అవయవాల కదలికలను కోల్పోయిన పక్షవాతం వచ్చిన వ్యక్తులు తమ ఆలోచనల ద్వారానే తమ స్మార్ట్ ఫోన్ను వేగంగా ఉపయోగించడానికి వీలు కలుగుతుంది.
The first @Neuralink product is called Telepathy
— Elon Musk (@elonmusk) January 29, 2024
న్యూరాలింక్ తో జంతువుల పైన విస్తృతమైన పరీక్షలను నిర్వహించగా, ప్రస్తుతం మానవుల పైన ప్రయోగాలు మొదలుపెట్టింది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భవిష్యత్తులో మెదడుకు సంబంధించిన, మానవ జీవనానికి, మేధస్సుకు సంబంధించిన అనేక వైద్య చికిత్సలలో కూడా కృత్రిమ మేధస్సు కీలకం కానుంది.












Click it and Unblock the Notifications