పుతిన్ అంటే ఏమిటో ప్రపంచ దేశాలకు మరోసారి అర్థమైంది??
ప్రపంచ దేశాలకు పుతిన్ అంటే ఏమిటో మరోసారి చూపించారు. అమలు చేయలేని ఆంక్షలను భుజానికెత్తుకుంటే ఏం జరుగుతుందో పశ్చిమ దేశాలకు బాగా అర్థమైంది. రష్యా లక్ష్యం నెరవేరడంతో జర్మనీకి గ్యాస్ సరఫరా మొదలైంది. చలికాలానికి ముందే ఐరోపా దేశాలకు గ్యాస్ సరఫరా ప్రారంభం కావడంతో అన్ని దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. రష్యా నుంచి గ్యాస్ అందకపోతే ఐరోపా దేశాల్లో చాలా ఇళ్లను వేడిగా ఉంచడం సాధ్యంకాదు. రష్యాలోని గ్యాస్ కంప్రెషర్ స్టేషన్ లో రెండు టర్బైన్లు మాత్రమే ఉండటం.. వాటిల్లో ఒకటి మెయింట్ నెన్స్ కు వెళ్లడంతో గ్యాస్ సరఫరా 20 శాతం తగ్గుతుందని పుతిన్ పరోక్షంగా ప్రకటించారు.
ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగడంతో రష్యా పరికరాలను వెనక్కి తిరిగిచ్చేందుకు కెనడా నిరాకరించింది. గ్యాస్ అందకపోతే గ్యాస్ సరఫరా లో ఏమవుతుందో అందరికీ బాగా అర్థం కావడంతో కెనడా తాను తొక్కిపట్టిన టర్బైన్ ను జర్మనీకి అప్పగించింది. వాస్తవానికి దీన్ని సముద్ర మార్గంలో తీసుకువెళతారు. ఆలస్యమవుతుందనే ఉద్దేశంతో ఎయిర్ కార్గోద్వారా జర్మనీకి పంపించింది. అక్కడి నుంచి మరో మూడు రోజుల్లో రష్యాకు చేరుకోబోతోంది. టర్బైన్ ను తరలించి వీలైనంత త్వరగా పనిచేయడం ప్రారంభించేలా చూడటమే తమ పని అని టర్బైన్ తయారీ కంపెనీ సీమెన్స్ ప్రతినిధి వెల్లడించారు.

రష్యాలోని వ్యోబోర్గ్ నుంచి జర్మనీలోని లుబిమిన్ వరకు 1224 కిలోమీటర్ల దూరం బాల్టిక్ సముద్రంలో ఈ పైపులైను నిర్మించారు. రష్యా కంపెనీ గ్యాజ్ ప్రోమ్ కు ఇందులో వాటా ఉంది. సంవత్సరానికి 55 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ను దీనిద్వారా సరఫరా చేస్తారు. జర్మనీకి లభించే గ్యాస్ ఈ మార్గంలోనే వస్తుంది. మొత్తానికి నార్డస్ట్రీమ్-1 పైపు లైను నుంచి జర్మనీకి గ్యాస్ సరఫరా ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications