ప్రేమంటే ఇదే: ప్రియుడికి ప్రియురాలు కిడ్నీ దానం
మాంచెస్టర్: వారిద్దరూ కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే హఠాత్తుగా ప్రేమజంటలో ఒకరికి కిడ్నీ సంబంధిత వ్యాధి సోకి కిడ్నీని మార్చాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో కిడ్నీ దాత కోసం ఎదురుచూస్తున్నారు.
కాగా, తానే కిడ్నీ దానం చేస్తానని ఆ ప్రేమజంటలో మరొకరు ముందుకొచ్చారు. విశేషమేమిటంటే ఆ ప్రియురాలి కిడ్నీ తన ప్రియుడికి కిడ్నీకి సరిపోయింది. దీంతో కిడ్నీ మార్చేందుకు సిద్ధమయ్యారు వైద్యులు.
వివరాల్లోకి వెళితే.. ఏడాది క్రితం గోల్ఫ్ కోర్సులో తొలిసారి కలుసుకున్నారు జాక్ సిమర్డ్(49), మిచెల్లీ లాబ్రాంషె. అనాటి నుంచి తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవడం జరిగేవి. ఆ తర్వాత ఒకరంటే ఒకరికి అభిమానం పెరిగి ఇద్దరూ ప్రేమలో పడ్డారు.
Girlfriend to donate kidney to boyfriend https://t.co/A698XDZ5OH pic.twitter.com/BUErE7igMu
— WMUR TV (@WMUR9) January 2, 2016 ఈ క్రమంలో న్యూహాంప్‌షైర్‌లోని స్టోన్ బ్రిడ్జీ కంట్రీ క్లబ్‌లో ఇద్దరు కలిసి తరచూ గోల్ఫ్ ఆడేవారు. అయితే, సిమర్డ్ రెండు మూత్రలు చెడిపోవడంతో గత కొంత కాలంగా కిడ్నీ దాత కోసం ఎదురుచూస్తున్నారు.
ప్రియుడి బాధను అర్థం చేసుకున్న మిచెల్లీ.. రహస్యంగా వెళ్లి తన కిడ్నీ అతనికి సరిపోతుందో లేదో పరీక్షలు చేయించుకుంది. ఆశ్చర్యకరంగా ఇద్దరి కిడ్నీలు మ్యాచ్ అయ్యాయి. దీంతో వీరి ప్రేమకు చిహ్నంగా వాలెంటైన్స్ డే(ఫిబ్రవరి 14న)నాడు మిషెల్లీ తన కిడ్నీని సిమర్డ్‌కు దానం చేయనుంది.
కాగా, సిమర్డ్ 19ఏళ్ల కిందట తొలిసారి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నారు. అప్పట్లో అతని సోదరి కిడ్నీ దానం చేసింది. ఇప్పుడు అతని ప్రియురాలు కిడ్నీ దానం చేసేందుకు ముందుకొచ్చింది. కాగా, తన భవిష్యత్ జీవితమంతా సిమర్డ్‌యేనని, ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని మిచెల్లీ తెలిపింది.












Click it and Unblock the Notifications