Pakistan: ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ కు నిరసనగా భారీగా ఆందోళనలు..

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ కు నిరసనగా పాక్ ఆందోళనలు జరుగుతోన్నాయి. ఇమ్రాన్ ఖాన్ అరెస్టు దేశవ్యాప్త నిరసనలకు పీటీఐ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో తెహ్రీక్ ఇ ఇన్స్ ప్ పార్టీ కార్యకర్తలు ప్రధాన నగరాల్లో ఆందోళనకు దిగారు. బలూచిస్థాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాలో నిరసనకారులు, సైన్యం మధ్య జరిగిన ఘర్షణల్లో ఒకరు మరణించినట్లు తెలిసింది. మరో ఐదుగురు గాయపడ్డట్లు సమాచారం.

కరాచీ, పెషావర్, రావల్పిండి, లాహోర్‌లలో జరిగిన హింసాకాండలో సుమారు 15 మంది గాయపడ్డారు. నిరసనలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పాక్ లో ట్విట్టర్‌తో సహా సోషల్ మీడియాను తత్కాలికంగా నిలిపివేశారు. ఇస్లామాబాద్ పాటు ఇతర నగరాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో బుధవారం తరగతులు రద్దు చేశారు.

protest against the arrest of Pak former pm Imran Khan

దాదాపు 4,000 మంది ఖాన్ మద్దతుదారులు లాహోర్‌లోని టాప్ రీజినల్ కమాండర్ అధికారిక నివాసంలోకి చొరబడ్డారు. కిటికీలు, తలుపులు పగలగొట్టారు. ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఆందోళనకారులు పోలీసు వాహనాలను తగులబెట్టడంతో పాటు కీలక రహదారులను దిగ్బంధించారు. రావల్పిండిలోని గ్యారీసన్ సిటీలోని పాకిస్థాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయం ప్రధాన గేటును కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు.

వందలాది మంది ప్రదర్శనకారులు విశాలమైన భవనం వైపు వెళ్లినప్పుడు ఖాన్ అనుకూల నినాదాలు చేశారు. పారామిలటరీ రేంజర్లు ఇమ్రాన్ ఖాన్‌ను అవినీతి కేసులో కోర్టు ప్రాంగణం నుంచి నాటకీయంగా అరెస్టు చేశారు. మధ్యాహ్నం ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టయిన కొద్దిసేపటికే.. ఆయన పార్టీ 'పీటీఐ' దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. తనను అరెస్టు చేస్తారని, మరోసారి మీతో మాట్లాడే అవకాశం లభించదని పాక్‌ పౌరులను ఉద్దేశించి ఇమ్రాన్‌ ఖాన్‌ 2022లో రికార్డు చేసిన ఓ ప్రసంగాన్ని పీటీఐ మరోసారి షేర్‌ చేయడంతో హింస చెలరేగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+