డొనాల్డ్ ట్రంప్ కుడిభుజంగా గుజరాతీ పటేల్- సెనెట్ గ్రీన్ సిగ్నల్: తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న డెమోక్రాట్లు

Kash Patel: అమెరికా ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్‌గా భారతీయ సంతతికి చెందిన కాష్ పటేల్ నియమితులయ్యారు. ఆయన నియామకానికి సంబంధించిన తీర్మానానికి సెనెట్ ఆమోదం తెలిపింది. రెండు ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది.

అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ పేరును ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. ఇలాంటి పదవులకు సంబంధించిన నియామకాలను సెనెట్ ఆమోదించాల్సి ఉంటుంది. తాజాగా ఈ తీర్మానంపై సెనెట్‌లో ఓటింగ్ నిర్వహించారు. 51-49 ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది.

The US Senate confirms Kash Patel as the Director of the FBI with 51-49 votes

డెమోక్రటిక్ సెనెటర్లందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఓటు వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అత్యంత కీలకమైన ఎఫ్‌బీఐ చీఫ్‌గా కాష్ పటేల్ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నామనే విషయాన్ని వాళ్లు చెప్పకనే చెప్పినట్టయింది. డెమోక్రటిక్ సెనెటర్ల ఏ ఒక్క ఓటు కూడా తీర్మానానికి అనుకూలంగా పడలేదు. సెనెట్ ఆమోదంతో కాష్ పటేల్‌కు లైన్ క్లియర్ అయింది.

కాష్ పటేల్.. పూర్తి పేరు కశ్యప్ ప్రమోద్ వినోద్ పటేల్. ప్రవాస భారతీయుడు. స్వరాష్ట్రం గుజరాత్. 1980లో న్యూయార్క్ గార్డెన్ సిటీలో జన్మించారు. ఆయన తండ్రి అమెరికాలోని ఓ ఏవియేషన్ సంస్థలో ఫైనాన్షియల్ ఆఫీసర్‌. లాంగ్ ఐలండ్‌లోని గార్డెన్ సిటీ హైస్కూల్‌‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్నారు కాష్ పటేల్.

2002లో యూనివర్శిటీ ఆఫ్ రిచ్‌మండ్‌లో క్రిమినల్ జస్టిస్‌లో డిగ్రీ చదివారు. అనంతరం యూనివర్శిటీ కాలేజ్ లండన్‌ నుంచి ఇంటర్నేషనల్ లా అభ్యసించారు. డొనాల్డ్ ట్రంప్ లాయలిస్ట్‌గా ఆయనకు గుర్తింపు ఉంది. ట్రంప్ తొలి హయాంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో కౌంటర్ టెర్రరిజం విభాగానికి సీనియర్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

కాష్ పటేల్ నియామకాన్ని వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్ పటేల్ నియామకాన్ని ముందడుగుగా అభివర్ణించింది. దేశ సమగ్రతను పునరుద్ధరించడానికి, చట్ట- న్యాయ వ్యవస్థను గాడిన పెట్టడానికి డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తోన్న అజెండాను అమలు చేయడంలో కీలకమైన అడుగు పడిందని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+