Wife: మహిళలను రేప్ చెయ్యాలని సైనికుడిని రెచ్చగొట్టిన భార్య, సేఫ్టీ ఎక్విప్‌మెంట్ వాడండి, క్రిమినల్ !

ఉక్రెయిన్/రష్యా: ఉక్రెయిన్ లోని అమాయకులైన మహిళల మీద రష్యా సైనికులు అత్యాచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఉక్రెయిన్ లోని మహిళల మీద మీరు అత్యాచారం చెయ్యాలని రష్యా సైనికుడికి అతని భార్య ఫోన్ లో రెచ్చగొట్టింది. అయితే మీరు కచ్చితంగా సేఫ్టీ ఎక్విప్‌మెంట్ వాడండి అని నవ్వుతూ చెప్పిన ఆడియో వైరల్ అయ్యింది. ఉక్రెయిన్ మహిళల మీద అత్యాచారం చెయ్యాలని సైనికుడికి చెప్పిన అతని భార్య పేరు ఇప్పుడు అంతర్జాతీయ నేరస్తుల జాబీతాలో చేరిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

లక్షల కోట్ల విలువైన ఆస్తులు ?

లక్షల కోట్ల విలువైన ఆస్తులు ?

ఉక్రెయిన్ మీద రస్యా విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ మీద రష్యా యుద్దం చేసిన సమయంలో ప్రపంచ దేశాలు రష్యా తీరును తప్పుబట్టాయి. రష్యా యుద్దం చేసిన సమయంలో ఉక్రెయిన్ లోని వేలాది మంది అమయాకులు బలి అయ్యారు. ఉక్రెయిన్ లో లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసం అయ్యాయి.

రష్యా సైనికుడి భార్య

రష్యా సైనికుడి భార్య

ఇదే సంవత్సరం ఫిబ్రవరి నుంచి రష్యా బలగాలు ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలపై దాడులు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాడి జరిగిన ప్రదేశంలో ఉక్రెయిన్ మహిళలపై అత్యాచారం చేయాలని రష్యా సైనికుడిని అతని భార్య కోరింది. ఈ ఆడియో వైరల్ కావడంతో ఉక్రెయిన్ పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు. వార్తా వెబ్‌సైట్ లీడింగ్ బ్రిటన్ సంభాషణ యొక్క నివేదిక ప్రకారం, రష్యా సైనికుడికి ఫోన్ చేసిన మహిళ రోమన్ బైకోవ్‌స్కీ (27)గా ఉక్రెయిన్ అధికారులు గుర్తించారు.

మీరు రేప్ చెయ్యండి.... కానీ సేఫ్టీగా ఉండండి

మీరు రేప్ చెయ్యండి.... కానీ సేఫ్టీగా ఉండండి

మీరు ఉక్రెయిన్ లో యుద్దం చేస్తున్నారు, అక్కడ ఉక్రెయిన్ మహిళలు ఉన్నారు. వారిపై అత్యాచారం చేయండి. నాకు ఏరు మీ అభర్యంతరం చెప్పకండి, నువ్వు అర్థం చేసుకో. దాని గురించి నాకు ఏమీ తెలియదు. నేను మీరు మహిళల మీద అత్యాచారం చెయ్యడానికి అనుమతిస్తాను. అయితే మీరు కచ్చితంగా సేఫ్టీ ఎక్విప్‌మెంట్ వాడండి అంటూ ఆ లేడీ నవ్వేసిన ఆడియో లీక్ కావడం కలకలం రేపింది.

వైరల్ అయిన ఆడియో క్లిప్

వైరల్ అయిన ఆడియో క్లిప్

ఈ లేడీ ఆడియో క్లిప్ రికార్డింగ్ వైరల్‌గా మారింది. ఇది విని ఉక్రెయిన్ భద్రతా బలగాలు షాక్‌కు గురయ్యాయి. రేడియో లిబర్టీలోని ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు మాట్లాడిన మహిళను కనుగొనడానికి ఉక్రేనియన్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో జతకట్టారు. ఈ కాల్‌తో సంబంధం ఉన్న ఫోన్‌ను దర్యాప్తు బృందం పర్యవేక్షించడం కొనసాగించింది. ఆ ఫోన్‌లోని నంబర్‌లలో ఒకటి ఏప్రిల్‌లో ఖేర్సన్ ప్రాంతంలో కనుగొనబడింది. కాల్‌లోని రెండు ఫోన్ నంబర్‌లు రష్యాకు చెందిన సోషల్ నెట్‌వర్క్‌తో అనుసంధానించబడినట్లు ఉక్రెయిన్ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.

అంతర్జాతీయ నేరస్తురాలు

అంతర్జాతీయ నేరస్తురాలు

పోస్ట్‌లో మాట్లాడుతున్న వారిలో ఒకరు రోమన్ బైకోవ్‌స్కీ, మరొకరు అతని భార్య ఓల్గా బైకోవ్‌స్కాయాగా ఉక్రెయిన్ అధికారులు గుర్తించారు. రోమన్ ఖాతా సోషల్ నెట్‌వర్క్‌లో ప్రజలకు కనిపించకుండా దాచిపెట్టగా, ఒకరు అప్‌లోడ్ చేసిన పోస్ట్ ద్వారా జర్నలిస్టులు ఆమె ఫోటోలను కనుగొన్నారు. తరువాత, బైకోవ్ స్కీ భార్య ఓల్గా బైకోవ్ స్కాయా ను ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ రాష్ట్ర, అంతర్రాష్ట్ర అంతర్జాతీయ వాంటెడ్ నేరస్థుల జాబితాలో ఆమె పేరును చేర్చడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+