ట్రంప్ హత్యకు డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులను హతమార్చిన యువకుడు!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ని హత్య చేయడానికి ప్లాన్ చేస్తున్న ఒక యువకుడిని కాన్సాస్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులను అత్యంత దారుణంగా కాల్చి చంపిన కేసులో గత నెలలో 17 సంవత్సరాల ఒక మైనర్ యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు తెలుసుకున్నారు.

పోలీసుల ఫెడరల్ వారెంట్ లో కీలక విషయాలు
17 ఏళ్ల వయసున్న సదరు యువకుడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను హత్య చేయడానికి కుట్ర పన్నినట్టు వారు గుర్తించారు. ట్రంప్ ని హతమార్చడానికి డబ్బులు ఇవ్వడం లేదని, ఆ కారణంగానే అతడు తల్లిదండ్రులను చంపి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ఈ మేరకు వారు ఫెడరల్ వారెంట్ లో కీలక విషయాలను వెల్లడించారు.

The young man who killed his parents because they didn t give money for Trump murder

తల్లిదండ్రులను చంపి శవాలతో కొన్నాళ్ళు సహజీవనం చేసిన యువకుడు
విస్కాన్సిన్ లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన 17 సంవత్సరాల నికిటా క్యాసప్, ఈ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీన తన తల్లి టటానియా, సవతి తండ్రి డోనాల్డ్ మేయర్ ను వాళ్ల నివాసంలోనే అత్యంత దారుణంగా తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత ఆ మృతదేహాలతోనే కొన్ని వారాలపాటు అక్కడే ఉన్నాడు. ఆపై 14 వేల డాలర్ల నగదును, పాస్పోర్టు ఇతర వస్తువులు తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

తల్లిదండ్రులను హతమార్చింది అందుకే
ఆ తర్వాత ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు సం పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడ ఇరువురి హత్య జరిగినట్టు గుర్తించారు. తల్లిదండ్రులను ఇద్దరినీ హతమార్చి అక్కడి నుంచి పరారైన నిందితుడు నికిటాను పోలీసులు కాన్సాస్ లో అరెస్ట్ చేశారు.ఇక నిందితుడిని దర్యాప్తు చేయగా నిందితుడు నుంచి అనేక కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. నిందితుడు ఆర్థిక స్వేచ్ఛ కోసం తల్లిదండ్రులను చంపినట్టు గుర్తించారు.

ట్రంప్ ని హతమార్చడానికి ఒక డ్రోన్, ఇతర పేలుడు పదార్థాల కొనుగోలు
అంతేకాదు అతడు అధ్యక్షుడు ట్రంప్ ను చంపేందుకు కుట్ర చేసినట్టు కూడా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను చంపాలని యువకుడు చేసినటువంటి కుట్ర తల్లిదండ్రులకు తెలియడంతో వారిని నిందితులు హత్య చేసినట్టు పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ని హతమార్చడానికి ఒక డ్రోన్, ఇతర పేలుడు పదార్థాలను కొనుగోలు చేసినట్టు, ఓ రష్యా వ్యక్తితో కలిసి ట్రంప్ ని చంపడానికి ప్లాన్ చేసినట్టు తెలిపారు.

సోషల్ మీడియా యాప్స్ ద్వారా సంభాషణలు
టిక్ టాక్, టెలిగ్రామ్ అంటే సోషల్ మీడియా యాప్ లలో డోనాల్డ్ ట్రంప్ ని చంపాలని సంభాషణలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. ట్రంప్ ను హతమార్చిన తర్వాత ఉక్రెయిన్ దేశానికి పారిపోవాలని అతను ప్రణాళిక రచించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దీనిపైన పోలీసులు దర్యాప్తు మరింత లోతుగా సాగిస్తున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+