రద్దీ ట్రాఫిక్‌లో దర్జాగా పెద్దపులి ఇలా(వీడియో)
దోహా: ట్రాఫీక్ రద్దీ ఉండటంతో వాహనాలన్ని నెమ్మదిగా వెళుతున్నాయి. ఒక్కసారిగా ఓ పెద్దపులి వాహనాల మధ్య నుంచి మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. ఒక్కసారిగా వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. అయితో ఈ ఉదంతాన్ని వీడియో తీయతగా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
రోడ్డుపై వెళుతున్న ఓ ట్రక్కులోనుంచి పులి రోడ్డుపైకి దూకినట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది. దీంతో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆ పులిని తరలిస్తున్న సమయంలో రోడ్డుపైకి దూకేసినట్లు తెలుస్తోంది.
కాగా, ఆ పులిని తర్వాత సురక్షితంగా పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక్కడి సంపన్న వర్గాలకు పులులను పెంచుకోవడం అలవాటుగా మారిందనే ఆరోపణలున్నాయి.












Click it and Unblock the Notifications