ప్రతి అమెరికన్ కూ 2,000 డాలర్ల పంపిణీ- ట్రంప్ సంచలన ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన టారిఫ్ విధానాన్ని సమర్థించుకున్నారు. భారత్ సహా వివిధ దేశాలపై విధించిన టారిఫ్ వల్ల ఖాజానాకు పెద్ద ఎత్తున నిధులు సమకూరుతున్నాయని తెలిపారు. దీనివల్ల రుణ ఒత్తిడి తగ్గుతోందని అన్నారు. జాతీయస్థాయి రుణాలను తగ్గించడానికి ఈ అదనపు నిధులను ఉపయోగిస్తామని పేర్కొన్నారు. త్వరలో ప్రతి అమెరికన్‌కు కనీసం 2,000 డాలర్ల డివిడెండ్ ఇస్తామని ఆయన ప్రకటించారు. ధనవంతులు మినహాయించి ప్రతి ఒక్కరికీ ఈ ప్రయోజనం వర్తిస్తుందని పేర్కొన్నారు.

ఈ మేరకు ఆయన తాజా ప్రకటన విడుదల చేశారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ ఫామ్ పై పోస్ట్ చేశారు. డివిడెండ్ పంపిణీ ప్రక్రియ త్వరలోనే చేపడతామని వెల్లడించారు. టారిఫ్‌లను వ్యతిరేకించేవారిపై డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. టారిఫ్‌ వ్యతిరేకులను మూర్ఖులుగా అభివర్ణించారు. తన పరిపాలనలో అమెరికా ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా ఎదిగిందని అన్ని దేశాలతో గౌరవాన్ని అందుకుంటోందని పేర్కొన్నారు.

Trump announces 2000 dollar Dividend for Every American

రికార్డు స్థాయి స్టాక్ మార్కెట్ ధరలతో ద్రవ్యోల్బణాన్ని దాదాపుగా నిర్మూలించగలిగామని ట్రంప్ స్పష్టం చేశారు. టారిఫ్‌ నుండి దేశానికి ట్రిలియన్ల కొద్దీ డాలర్లు వస్తున్నాయని ఆయన వివరించారు. ఈ నిధులను 37 ట్రిలియన్ల డాలర్ల మేర ఉన్న జాతీయ రుణ భారాన్ని తగ్గించడానికి వినియోగిస్తామని ట్రంప్ తెలిపారు. త్వరలోనే అప్పు తీర్చడం కూడా ప్రారంభిస్తామని, అధిక ఆదాయం ఉన్నవారిని మినహాయించి.. ప్రతి ఒక్కరికీ కనీసం 2,000 డాలర్ల డివిడెండ్ ఇస్తామని చెప్పారు.

టారిఫ్ లను విధించడం వల్ల స్వదేశంలో పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఫ్యాక్టరీలు వెలుస్తున్నాయని, రికార్డు స్థాయి ఆర్థిక విజయాలను సాధించామని ట్రంప్ పేర్కొన్నారు. టారిఫ్ డివిడెండ్ పంపిణీ ఎలా ఉంటుందనేది ట్రంప్ ఇంకా వివరించలేదు. ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది కూడా తెలియజేయలేదు. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం అమెరికా జాతీయ రుణం 38.12 ట్రిలియన్ డాలర్లుగా ఉంటోంది. అదనపు టారిఫ్ ల వస్తోన్న ఆదాయాన్ని ఈ రుణాన్ని తగ్గించడానికి వినియోగిస్తామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ఇదివరకే వెల్లడించారు. ఈ టారిఫ్ వల్ల వస్తోన్న అదనపు ఆదాయం.. మరిన్ని సౌకర్యాలను కల్పించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. టారిఫ్‌లు దేశానికి బలమైన ఆర్థిక వనరుగా మారాయని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+