అమెరికా అధ్యక్షుడిగా ఇంతకంటే గర్వపడలేను
చంద్రుని చుట్టూ సాగిన చారిత్రాత్మక యాత్ర విజయవంతంగా ముగిసింది. ఆర్టెమిస్ 2 సురక్షితంగా భూమికి తిరిగొచ్చింది. వ్యోమగాములు క్షేమంగా నేలకు చేరారు. వాళ్లు ప్రయాణించిన ఓరియన్ క్యాప్సూల్ కొద్దిసేపటి కిందటే పసిఫిక్ మహాసముద్రంలో స్ప్లాష్ డౌన్ అయింది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా దీనికి సంబంధించిన ఓ అద్భుతమైన వీడియో ఫుటేజీని విడుదల చేసింది. ఈ దృశ్యం చంద్రుడిని జయించిన ఓ గొప్ప క్షణాన్ని ఆవిష్కరించింది.
అమెరికా ఈస్టర్న్ టైమ్ జోన్ ప్రకారం.. రాత్రి 8:07 నిమిషాల (భారత కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున 6:10 నిమిషాలు) కు ఆర్టెమిస్ 2 వ్యోమగాములు భూమిపై సురక్షితంగా అడుగు పెట్టారు. ఈ మిషన్ నిజంగా చరిత్రను తిరగరాసింది. ఇంతకు ముందు ఏ మానవ మిషన్ కూడా అంతరిక్షంలో ప్రయాణించనంత దూరానికి వెళ్లింది. అపోలో శకాన్ని మటుమాయం చేసింది.

భూమి నుండి చంద్రుడి వైపు 6,78,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించిందీ ఆర్టెమిస్ 2 ఓరియన్. చంద్రుడి అవతలి వైపు చుుట్టి వచ్చింది. ఆ సమయంలో అక్కడ సంభవించిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని రికార్డు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇదివరకే విడుదల అయ్యాయి. చంద్రుడికి అవతలివైపు గల వాతావరణం గురించి సమగ్రంగా తెలుసుకుంది. తాజాగా ఈ ఓరియన్ క్యాప్సూల్ భూ వాతావరణంలోకి హైపర్‌సోనిక్ వేగంతో తిరిగి ప్రవేశించింది.
ఆ సమయంలో దాని వేగం సెకెను 38,749 కిలోమీటర్లుగా రికార్డయింది. ఆ వేగాన్ని నియంత్రించడం నాసాకు అతిపెద్ద సవాల. ఆ సమయంలో మిషన్ కఠిన సవాళ్లను ఎదుర్కొంది. వ్యోమనౌక బయటి ఉష్ణోగ్రత సుమారు 2,700 డిగ్రీల సెల్సియస్ కు చేరాయి. అక్కడ సంభవించిన ప్లాస్మా షీత్ కారణంగా బ్లాక్ అవుట్ సైతం ఏర్పడింది. ఒకదశలో నాసా గ్రౌండ్ స్టేషన్స్ తో కమ్యూనికేషన్స్ కొద్దిసేపు స్తంభించిపోయింది కూడా. ఈ క్లిష్ట దశను ఓరియన్ క్యాప్సూల్ విజయవంతంగా అధిగమించింది.
NEXT STEP: MARS! https://t.co/xtgQ506nZD pic.twitter.com/X4TJDFp67A
— The White House (@WhiteHouse) April 11, 2026
నాసా సాధించిన ఈ ఘనతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆర్టెమిస్ క్రూ, నాసా సైంటిస్టులను అభినందించారు. వారికి భవిష్యత్తు లక్ష్యాలను సూచించారు. ఆర్టెమిస్ 2 సాధించిన విజయం తనను అబ్బురపరిచిందని వ్యాఖ్యానించారు. ఓ గొప్ప, చారిత్రాత్మక మిషన్ గా అభివర్ణించారు. ఆస్ట్రోనాట్లు ఎంతో ప్రతిభావంతులని ప్రశంసించారు.
ఈ మొత్తం ప్రయాణం ఓ అద్భుతమని, స్ప్లాష్ డౌన్ విజయవంతంగా కావడంతో ఈ మిషన్ సంపూర్ణమైందని డొనాల్డ్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడిగా తాను ఇంతకంటే గర్వపడలేనని వ్యాఖ్యానించారు. త్వరలో వైట్ హౌస్‌లో నాసా సైంటిస్టులు, నలుగురు వ్యోమగాములను కలుస్తానని పేర్కొన్నారు. అదే సమయంలో మరో ప్రయోగానికి తెర తీశారు డొనాల్డ్ ట్రంప్. ఇక తమ తదుపరి అడుగు అంగారక గ్రహంపై పడాలని సూచించారు.












Click it and Unblock the Notifications