డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో మరొకటి బలి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతిఫాను 'ఉగ్రవాద సంస్థ'గా ప్రకటించారు. ఈ మేరకు తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. దీన్ని ఎలా అమలు చేస్తారనేది స్పష్టంగా తెలియరాలేదు. అంతిఫాకు నిర్దుష్టమైన నాయకత్వం గానీ, కేంద్ర వ్యవస్థ గానీ లేదు. ఫలితంగా- డొనాల్డ్ ట్రంప్ ఎవరిని లక్ష్యంగా చేసుకుంటారన్న దానిపై సందిగ్ధత నెలకొంది.

"మన యూఎస్‌ దేశభక్తులకు ఒక శుభవార్త. 'అంతిఫా'ను, ఒక 'అనారోగ్యకరమైన, ప్రమాదకరమైన, తీవ్రవాద వామపక్ష విపత్తు'గా, ఒక పెద్ద ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నాను" అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనికి నిధులు సమకూరుస్తున్న వారిపై అత్యున్నత చట్టపరమైన ప్రమాణాలు, పద్ధతులకు అనుగుణంగా దర్యాప్తు చేయాలని సిఫార్సు చేస్తాను. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేస్తాను.. అని ఆయన తన పోస్ట్‌లో రాశారు.

Trump Declares Antifa a Terrorist Organization

రాజకీయ హింసను ప్రేరేపించే వామపక్ష సంస్థలను ఎదుర్కోవడంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ తీసుకునే అనేక చర్యల్లో ఇది ఒకటని వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు. కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ హత్య తర్వాత ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పట్లో ఓవల్ ఆఫీస్ నుండి చేసిన ప్రసంగంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కిర్క్ హత్యను వామపక్ష సమన్వయ ప్రయత్నంగా అభివర్ణించారు. ఈ హింసాత్మక పరిస్థితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో తేల్చి చెప్పారు ట్రంప్.

దీనికి అనుగుణంగా తాజా ప్రకటన చేశారు ట్రంప్. కాగా- అసమ్మతిని అణచివేయడానికి ఒక సాకు ఆంతిఫాను చూపిస్తోన్నారని డెమొక్రాట్లు విమర్శిస్తోన్నారు. నిజానికి- తన మొదటి పదవీకాలంలోనే ట్రంప్ అంతిఫాను ఉగ్రవాద సంస్థగా గుర్తించేందుకు చర్యలు తీసకున్నారు గానీ అప్పట్లో అది సాధ్యపడలేదు. అప్పటి అటార్నీ జనరల్ విలియం బార్.. ఈ సంస్థను దేశీయ ఉగ్రవాదిగాగా పేర్కొన్నారు.

అంతిఫా అనేది వామపక్ష, యాంటీ- ఫాసిస్ట్, యాంటీ- రేసిస్ట్ సంస్థ. దీనికి ఓ నాయకత్వం అంటూ ఏదీ లేదు. ఈ సంస్థ చేపట్టే కార్యకలాపాలను ఓ సామాజిక ఉద్యమగా చెబుతుంటారు అమెరికన్లు. విదేశీ ఉగ్రవాద సంస్థలకు ఆంతిఫా సహకరిస్తుంటుందనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. దీనికి సంబంధించిన ఎటువంటి సాక్ష్యాధారాలు లేవనీ సీఎన్ఎన్ పేర్కొంది. ఒక వికేంద్రీకృత ఉద్యమ సంస్థగా అభివర్ణించింది.

ఆంతిఫాకు ఛైర్మన్ వంటి నాయకత్వం గానీ, ప్రధాన కార్యాలయం అంటూ ఏదీ లేదు. అవసరం వచ్చినప్పుడు మాత్రం వేల సంఖ్యలో ఆంతిఫా కార్యకర్తలు గుమిగూడుతుంటారు. అజెండాకు అనుగుణంగా ఉద్యమిస్తుంటారు. అంతిఫాను భయంకర ఉగ్రవాద సంస్థగా, ఇటువంటి సామాజిక సమూహాలు ఇంకా చాలా ఉన్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. వాటిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+