73 క్షమాభిక్షలు- 70 శిక్షల తగ్గింపు- గద్దె దిగే ముందు ట్రంప్ దయాగుణం

అమెరికా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్న వేళ డొనాల్డ్‌ ట్రంప్‌ ఎక్కడలేని దయాగుణం ప్రదర్శించారు. తన నాలుగేళ్ల పదవీ కాలంలో ఎన్నడూ చూపనంత ఔదార్యం చూపారు. ఓ దశలో తనకు తాను క్షమాభిక్ష ప్రకటించుకుంటారని భావించినా అలా జరగలేదు. కానీ పదవి నుంచి తప్పుకునే ముందు మాత్రం ట్రంప్‌ ఏకంగా 140 మందికి క్షమాభిక్ష ప్రకటించి సంచలనం సృష్టించారు.

బుధవారం పదవి నుంచి తప్పుకోవాల్సిన సమయం ఆసన్నం కానుండటంతో ఆదివారమే ట్రంప్‌ తన కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌తో కలిసి క్షమాభిక్ష కోసం వచ్చిన అభ్యర్ధనలను ఖరారు చేశారు. చివరికి క్షమాభిక్ష ప్రకటించాల్సిన వారి తుది జాబితాను ఇవాంకా వైట్‌హౌస్‌ కౌన్సెల్‌ ఆఫీసుకు పంపారని న్యూయార్క్ టైమ్స్‌ పేర్కొంది. అక్కడి నుంచి ఈ జాబితా అమెరికా ప్రభుత్వ జస్టిస్‌ డిపార్ట్‌మంట్‌కు ఆమోదం కోసం వెళుతుంది. దీనిపై న్యాయశాఖ సమీక్ష నిర్వహించి అభ్యంతరాలు లేకపోతే దీన్ని ఖరారు చేస్తుంది.

Trump issues 73 pardons and 70 commutations in a final wave of executive clemency

డొనాల్డ్‌ ట్రంప్‌ క్షమాభిక్ష ప్రసాదించిన వారిలో 70 మంది మరణశిక్ష పడిన వారితో పాటు మరో 73 మంది శిక్ష తగ్గింపు చేసిన వారూ ఉన్నారు. ట్రంప్ క్షమాభిక్ష అందుకున్న వారిలో మాజీ వ్యూహకర్త స్టీవ్‌ బానన్‌, మాజీ టెట్రాయిట్‌ మేయర్‌ క్వామే కిల్‌ప్యాట్రిక్‌, ర్యాపర్ లిన్‌వేన్, ర్యాపర్ కొడాక్‌ బ్లాక్‌, ఎలియాడ్‌ బ్రాయ్‌డీ వంటి వారు ఉన్నారు.

అయితే ట్రంప్ క్షమాభిక్ష జాబితాలో ఉంటారని భావించిన రూడీ గిలియానీ, జులియన్ అసాంజ్‌, ఎడ్వర్డ్‌ స్నోడెన్, జో ఎక్సోటిక్‌ వంటి వారికి మాత్రం అవకాశం దక్కలేదు. అయితే పదవి నుంచి తప్పుకున్నాక తనకు ఉపయోగపడతారని భావించిన వారికి మాత్రమే ట్రంప్‌ క్షమాభిక్షకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+