ఆ దేశాలపై 50 శాతం టారిఫ్ లు .. ట్రంప్ మళ్లీ మొదలెట్టేశాడు బాబోయ్..!
దాదాపు 40 రోజులుగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధంలో ఎట్టకేలకు ముందడుగు పడింది. ఇరాన్- అమెరికా మధ్య తాజాగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ మేరకు ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు వారాల గడువు ఇచ్చారు. ఇక కాల్పుల విరమణకు అంగీకరించిన ఇరాన్.. తాము ప్రతిపాదించిన 10 పాయింట్ల ప్రణాళికను అమెరికా ఆమోదించిందని పేర్కొంది. అటు ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే చెప్పింది. ఇక ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజుగా అభివర్ణించారు.
అయితే తాజాగా ఇరాన్ తో కాల్పుల విరమణ అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వార్నింగ్ ఇచ్చారు. ఏ దేశమైనా ఇరాన్ కు మిలిటరీ ఆయుధాలు సరఫరా చేస్తే ఆ దేశాలపై 50 శాతం టారిఫ్ లు విధిస్తామని హెచ్చరించారు. ఆ దేశాలపై టారిఫ్ లు ఎలాంటి అనుమానం లేకుండా తక్షణమే అమల్లోకి వస్తాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
" ఏదైనా దేశం ఇరాన్ కు మిలిటరీ ఆయుధాలు సరఫరా చేస్తే ఆ దేశంపై తక్షణమే 50 శాతం టారిఫ్ లు అమల్లోకి వస్తాయి. ఆ దేశం నుంచి అమెరికాకు వచ్చే అన్ని రకాల ఉత్పత్తులపై టారిఫ్ లు విధిస్తాం" అని ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు. మరో సెపరేట్ పోస్టులో.. ఇరాన్ తో క్లోజ్ గా చర్చలు జరిపేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అన్నారు. ఇరు దేశాల మధ్య చర్చలు సఫలం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరాన్ తన అణు కార్యక్రమాలు అన్నింటినీ తక్షణమే ఆపివేయడం అలాగే యూరేనియం శుద్ధిని, బాలిస్టిక్ మిసైల్స్ ను వినియోగించకుండా ఉండేందుకు అమెరికా కట్టుబడి ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇస్లామాబాద్ లో శుక్రవారం ఈ ఇరు దేశాల మధ్య చర్చలు ప్రారంభం కానున్నాయి.

మరోవైపు అమెరికా డిఫెన్స్ మినిస్టర్ హెగ్ సేత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తో ఇక ముప్పు లేదని పేర్కొన్నారు. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ప్రశంసించారు. ట్రంప్ వల్లే కాల్పుల విరమణ సాకారమైందన్నారు. కాల్పుల విరమణ కోసం ఇరాన్ బ్రతిమాలుకుందని హెగ్ సేత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పై ట్రంప్ దయ చూపించారని పేర్కొన్నారు.
-
భారతీయులకు గండం! కేంద్రం రెడ్ అలర్ట్. రంగంలోకి ఎంబసీ. -
US Iran: గెలుపు ఎవరిది? అసలు ఇస్లామాబాద్‌లో ఏం జరగబోతోంది? -
ట్రంప్ డెడ్ లైన్ ముగుస్తున్న వేళ రోడ్లపైకి ఇరాన్ ప్రజలు- ఏం చేస్తున్నారంటే ? -
అమెరికా- ఇరాన్ మధ్య సడన్ సీజ్ ఫైర్: 10 పాయింట్స్ ఫార్ములా -
అమెరికా సీజ్ ఫైర్ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్.. నెక్ట్స్ ఏంటి..? -
రానున్న 12 గంటలు రైలులో ప్రయాణం చేయకండి: ప్రజలకు కీలక హెచ్చరికలు -
కోడిగుడ్డు అక్షరాల రూ.25 వేలు..? -
అమెరికాపై డ్రాగన్ దాడి.. ఇరాన్ చేతికి యుద్ధ వ్యూహాలు! -
పాకిస్తాన్ ప్రధాని చుట్టూ -
ఎల్లుండే.. పాకిస్తాన్ లో ఏం జరగబోతోంది -
అమెరికాతో 45 రోజుల సీజ్ ఫైర్? ఇరాన్ కీలక షరతు-పాక్ మధ్యవర్తిత్వం..! -
లైఫ్ టైమ్ సెటిల్మెంట్- ఓ మనిషి జీవితకాలంలో ఎప్పుడూ చూడని అద్భుతాన్ని వీక్షించారు











Click it and Unblock the Notifications