పాకిస్తాన్ నియంతకు ట్రంప్ అసలు పరీక్ష.. ! గాజాకు పంపుతారా ?

ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ కు దగ్గరవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక పావు కదిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత స్వదేశంలో అంతకంతకూ బలపడుతున్న పాకిస్తాన్ సర్వసైన్యాధ్యక్షుడు (సీడీఎస్) ఆసిమ్ మునీర్ విధేయతను పరీక్షించేందుకు మరో పరీక్ష పెట్టబోతున్నారు. ఇందుకోసం ఆసిమ్ మునీర్ కు ఓ టాస్క్ అప్పగించబోతున్నారు. ఇందులో ఆసిమ్ మునీర్ పాస్ అయితే పరిస్దితులు ఎలా మారతాయన్న దానిపై అరబ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

పాలస్తీనాలోని గాజాలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య సుదీర్ఘంగా సాగిన యుద్దాన్ని ఆపిన ట్రంప్.. ఈ సందర్భంగా 20 పాయింట్లతో శాంతి ప్రణాళిక ప్రకటించారు. దీనికి పాకిస్తాన్ కూడా మద్దతు పలికింది. ఈ ప్రణాళికలో భాగంగా యుద్ధంలో దెబ్బతిన్న పాలస్తీనా భూభాగంలో పునర్నిర్మాణం, ఆర్థిక పునరుద్ధరణ కోసం చేపట్టే కార్యక్రమాల్ని పర్యవేక్షించడానికి ముస్లిం దేశాల నుండి ఒక దళాన్ని ఏర్పాటు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అలాగే హమాస్ ను నిరాధీయుధీకరణ చేయాలన్న ట్రంప్ ఆలోచన అమలుకు సహకరిస్తే తమ దేశాల్లో ముస్లింల జనాభా నుంచి వ్యతిరేకత తప్పదని పలు దేశాలు ఆందోళనలో ఉన్నాయి.

Trump s real test for Pakistan s Asim Munir Send troops to war-torn Gaza

అయితే స్వదేశంలో ఇబ్బందుల్ని లెక్కచేయకుండా అమెరికాకు పాకిస్తాన్ ను దగ్గరచేయడానికి ప్రయత్నిస్తున్న ఆ దేశ సైనిక నియంత ఆసిమ్ మునీర్ మాత్రం ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆయన త్వరలో ట్రంప్ తో భేటీ కానున్నారు. ఇందులో ఆసిమ్ మునీర్ ను పాకిస్తాన్ బలగాల్ని గాజాకు పంపాలని ట్రంప్ కోరబోతున్నారు. పాకిస్తాన్ కు అండగా నిలవాలంటే ట్రంప్ మాట వినక తప్పని పరిస్దితి మునీర్ ది.

Trump s real test for Pakistan s Asim Munir Send troops to war-torn Gaza

ఈ మిషన్‌లో భాగం కావడానికి పాకిస్తాన్ నిరాకరిస్తే మాత్రం ట్రంప్ ఆగ్రహం చవిచూడాల్సి రావచ్చు. ఎందుకంటే అసిమ్ మునీర్ సహా పౌర, సైనిక నాయకత్వం కూడా పాకిస్తాన్‌లో అమెరికా పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నారు. చాలా కాలంగా ఈ పెట్టుబడులు ఆగిపోయాయి. మరోవైపు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ గత నెలలో ఇస్లామాబాద్ శాంతి పరిరక్షణ కోసం దళాలను అందించడాన్ని పరిశీలిస్తుందని, కానీ హమాస్‌ను నిరాయుధీకరించడం తమ పని కాదన్నారు. దీంతో ఇప్పుడు ఆసిమ్ మునీర్ ట్రంప్ కు ఇవ్వబోయే హామీ చర్చనీయాంశంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+