Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇజ్రాయెల్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. బాంబులు వేయొద్దు.. పైలట్లు వెనక్కు రావాలంటూ ఆదేశాలు

ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య జూన్ 13 నుంచి సాగిన భీకర యుద్ధం ఎట్టకేలకు ట్రంప్ కార్డుతో ముగిసిపోయిందను కుంటే మళ్లీ ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి దాడులు చేసుకున్నాయి. ట్రంప్ మాట విన్నట్లుగానే నటించి మళ్లీ మొదటికి వచ్చాయి. అయితే ఈ వ్యవహారంపై ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇజ్రాయెల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ పై బాంబులు వేయోద్దని.. పైలట్లను ఇంటికి వచ్చేయమని ఆదేశాలు ఇవ్వాలని సూచనలు చేశారు.

ఇజ్రాయెల్- ఇరాన్ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ తమపై మరోసారి దాడికి పాల్పడిందని ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ పై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంబులు వేయొద్దని సూచించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ లో పోస్టు చేశారు.

" ఇజ్రాయెల్. బాంబులు వేయొద్దు. అలా చేస్తే కాల్పుల విరమణ ఉల్లంఘించినట్లు అవుతుంది. మీ పైలట్లను ఇళ్లకు రమ్మనండి.. ఇట్లు డొనాల్డ్ ట్రంప్, అధ్యక్షుడు, యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా" అని పోస్టు చేశారు.

Trump s Urgent Plea Don t Bomb Iran Israel Told to Stand Down

మరోవైపు ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 12 రోజులుగా సాగుతున్న యుద్ధంలో తమ లక్ష్యాలను పూర్తిచేశామని తెలిపింది. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాము అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా ఇరాన్ తమపై దాడులు చేసిందని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ మేరకు ఇజ్రాయెల్ కు చెందిన రెండు క్షిపణులను ఇజ్రాయెల్ నేలమట్టం చేసిందని ఆ దేశ రక్షణ మంత్రి కట్జ్ తెలిపారు.

అయితే ఇరాన్ మాత్రం తాము ఎలాంటి దాడులు చేపట్టలేదని అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని ఇజ్రాయెల్ పై క్షిపణి ప్రయోగాలు చేయలేదని స్పష్టం చేసింది. అంతకుముందు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అబ్బాస్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ దాడులు ఆపితే తాము ఎలాంటి దాడులు చేయబోమని తెలిపారు.

అంతకు ముందు ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ లో ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని తెలిపారు. ఈ మేరకు ఇరు దేశాలకు ఆయన కంగ్రాట్స్ తెలియజేశారు. కాల్పులను విరమించేందుకు ఇరు దేశాలు అంగీకారం తెలిపినట్లు ఆయన రాసుకొచ్చారు. అయితే మరోసారి ఇజ్రాయెల్.. లైను దాటి బాంబులు ప్రయోగించే యోచనలో ఉన్నట్లు తెలిసిన ట్రంప్ తాజాగా ఆ దేశానికి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ పై బాంబులు వేయోద్దన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+