రాత్రి 11:30కి ఫోన్ లో.. ప్రధాని మోడీతో మాట్లాడనున్న ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేయనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. భారతీయ కాల మాన ప్రకారం.. మంగళవారం రాత్రి 11:30 గంటలకు ట్రంప్...
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేయనున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. మంగళవారానికి ట్రంప్ షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా వైట్ హౌస్ వర్గాలు ఈ మేరకు పేర్కొన్నాయి.
భారతీయ కాల మాన ప్రకారం.. మంగళవారం రాత్రి 11:30 గంటలకు (వాషింగ్టన్ లో మధ్యాహ్నం ఒంటి గంట) ట్రంప్... ప్రధాని మోడీతో మాట్లాడతారు. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇప్పటికే నలుగురు దేశాధినేతలతో ట్రంప్ మాట్లాడారు.

జనవరి 21న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడీ, మెక్సికో అధ్యక్షుడు పేనా నీటో లతో ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు, ఈజిప్ట్ అధ్యక్షడు అబ్దెల్ ఫతా ఎల్ సీసీలకూ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు.
ఇక ట్రంప్ మాట్లాడనున్న ఐదో దేశాధినేత మన నరేంద్ర మోడీ. నవంబర్ 8న అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపిన అతి కొద్దిమంది దేశాధినేతలలో మోడీ ఒకరు.
ఎన్నికల ప్రచార సమయంలో కూడా ట్రంప్ ఇండియా తో సంబంధాలను మెరుగుపరచు కోవడంపై ఆసక్తి చూపారు. ఇండియాలో ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టిన ఆర్ధిక సంస్కరణలను ఆయన ప్రశంసించారు కూడా. ఇప్పుడు ఆయనే స్వయంగా మోడీకి ఫోన్ చేస్తుండడం చూస్తుంటే
భారత్ తో బంధం బలోపేతానికి తొలి అడుగు వేసినట్లే కనిపిస్తోంది.
-
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఖమేనీ సంధి ఒప్పందం? -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్











Click it and Unblock the Notifications